సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య
నందమూరి సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించారు బాలకృష్ణ... ఇవాళ సుహాసినితో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని.. వారి సంక్షేమం కోసం ఎన్టీఆర్, చంద్రబాబు ఎనలేని కృషి చేశారన్నారు.

తెలుగుదేశం పార్టీని స్ధాపించిన తర్వాత హరికృష్ణ నాన్నను చైతన్య రథంపై తిప్పడంతో పాటు ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచారని కొనియాడారు. మంత్రిగా రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారని... ట్రాక్టర్లపై రోడ్ ట్యాక్స్‌ను మినహాయించడంతో పాటు మహిళా కండక్టర్లకు అవకాశం కల్పించారని హరికృష్ణ సేవలను గుర్తు చేసుకున్నారు.
మహిళా సంక్షేమం, మహిళా సాధికారితకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని.. ఎన్టీఆర్, చంద్రబాబు ఆడపడుచుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని బాలకృష్ణ అన్నారు. ఈ నెల 26 నుంచి తెలంగాణ వ్యాప్తంగా మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై ఆయన మాట్లాడుతూ.. ఎవరి ఇష్టం వాళ్లదని.. రావాలనుకుంటే వస్తారు, లేదంటే రారని కుండబద్ధలు కొట్టారు.