తెలంగాణ ఎన్నికలు.. టీఆర్ఎస్ లోకి టీడీపీ కీలకనేతలు

Published : Nov 19, 2018, 11:45 AM IST
తెలంగాణ ఎన్నికలు.. టీఆర్ఎస్ లోకి టీడీపీ కీలకనేతలు

సారాంశం

డీపీకి ఊహించని షాక్ తగిలింది.టీడీపీ కీలక నేతలు పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుందుకు రంగం సిద్ధం చేసుకున్నారు

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. నేటితో నామినేషన్ల పర్వం కూడా ముగియనుంది. కాగా.. ఇలాంటి సమయంలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది.టీడీపీ కీలక నేతలు పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 

ముషీరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జి.సరితా గోవింద్ దంపతులు టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి జి.గోవింద్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించారు.

ముషీరాబాద్ టికెట్ ని టీఆర్ఎస్ ముఠా గోపాల్ కి కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో..తమ వర్గానికి చెందిన నేతకు టికెట్ కేటాయించారనే కారణంతో వారు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని అనుకుంటున్నట్లు వారు తెలిపారు.

తమ సామాజిక వర్గానికి చెందిన వారు అధికారంలో ఉంటే.. తమకు న్యాయం జరుగుతుందనే భావనతో వారు పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. సరితా, గోవింద్ లు ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలోనే కొనసాగుతున్నారు. వీరికి బలగం కూడా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. వీళ్లు ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరడం టీడీపీకి పెద్ద షాకేనని పలువురు భావిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. Governor Telugu Speech | Asianet News Telugu
Rain Alert : హైదరబాదీలూ... ఈ సాయంత్రం జాగ్రత్త సుమా..! డేంజర్ వెదర్ అప్డేట్