కాంగ్రెస్, టీఆర్ఎస్ సీట్ల కేటాయింపు: రెడ్లదే పై చేయి

By narsimha lodeFirst Published Nov 14, 2018, 6:37 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్, టీఆర్ఎస్  అభ్యర్థుల జాబితాలో ఇప్పటివరకు  ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు టికెట్లు  దక్కించుకొన్నారు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్, టీఆర్ఎస్  అభ్యర్థుల జాబితాలో ఇప్పటివరకు  ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు టికెట్లు  దక్కించుకొన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లున్నాయి.ఇప్పటివరకు  107 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 95 సీట్లలో పోటీ చేయనుంది.  ప్రజా కూటమి(మహాకూటమి)లోని భాగస్వామ్య పార్టీలకు 25 సీట్లను  కేటాయించనుంది.

టీఆర్ఎస్ ఇంకా 12 సీట్లను ప్రకటించాల్సి ఉంది.  కాంగ్రెస్ పార్టీ ఇంకా 29 సీట్లను ప్రకటించాల్సి ఉంది.  టీఆర్ఎస్ పార్టీ 37 సీట్లను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 75 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో ప్రకటించిన 65 మంది అభ్యర్ధుల్లో  23 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారున్నారు. రెండో జాబితాలో 10 మంది అభ్యర్థులున్నారు. రెండో జాబితాలో ఆరుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు.ఈ రెండు పార్టీల నుండి  ఈ సంఖ్య  పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

టీఆర్ఎస్ ప్రకటించిన 107 మంది అభ్యర్థుల్లో  20 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఆ పార్టీ టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు తొలి జాబితాలో 13 సీట్లను బీసీలకు కేటాయించింది.రెండో జాబితాలో ఒక్కరే బీసీ సామాజికవర్గానికి టికెట్టు కేటాయించింది.

బీసీలకు తక్కువగా కాంగ్రెస్ పార్టీ టికెట్లను కేటాయించిందనే  విషయమై బీసీలు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.

107 మంది టీఆర్ఎస్‌ అభ్యర్ధుల్లో నలుగురు మహిళలకు మాత్రమే టికెట్లను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోనే 10 మంది మహిళలకు సీట్లు కేటాయించింది. రెండో జాబితాలో మాత్రం మహిళలకు స్థానం దక్కలేదు.

సంబ:దిత వార్తలు

కాంగ్రెస్‌తో తేలని పంచాయితీ: మిత్రుల స్థానాల్లో టీజేఎస్ పోటీ

సీట్ల సర్దుబాటు: కాంగ్రెస్‌కు కోదండరామ్ డెడ్‌లైన్

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొగ

 

click me!