అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Nov 24, 2018, 12:23 PM IST
Highlights

కేటీఆర్ కొడుకును రాష్ట్ర ప్రజలకు రోల్‌మోడల్‌గా  రుద్దే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేశారని  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి  చెప్పారు.

హైదరాబాద్: కేటీఆర్ కొడుకును రాష్ట్ర ప్రజలకు రోల్‌మోడల్‌గా  రుద్దే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేశారని  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి  చెప్పారు. ఈ విషయాన్ని సహించలేకే  తాను  కేటీఆర్ కొడుకు విషయమై విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు.

శనివారం నాడు హైద్రాబాద్‌లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎంగా ఉన్న కేసీఆర్ సచివాలయానికి రాకున్నా... కేటీఆర్ కొడుకు మాత్రం తన స్నేహితులతో కలిసి సచివాలయానికి  వచ్చారని  ఆయన గుర్తు చేశారు. భద్రాచలంలో సీఎం కుటుంబసభ్యులతో కలిసి తలంబ్రాలు  సమర్పించాల్సి ఉండగా  కేటీఆర్ కొడుకుతో తలంబ్రాలు పంపడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం తర్వాత నిర్వహించిన సభలో  కేటీఆర్ కొడుకును వేదికపై తన సీటు పక్కనే కేసీఆర్ కూర్చొబెట్టుకొన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఏ రకమైన సందేశాన్ని కేసీఆర్  ఇచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.ఈ విషయాలపై తాను  ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారన్నారు. 

ఈ కారణంగానే తన ఒక్కగానొక్క కూతురు నిశ్చితార్థానికి తాను హాజరుకాకుండా ఉండేందుకు గాను కోర్టులో బెయిల్ రాకుండా ఢిల్లీ నుండి లాయర్లను తీసుకొచ్చి కోర్టులో వాదనలను విన్పించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్  కుటుంబం ఈ విషయంలో  రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

నీళ్లు, నిధులు, నియామకాలు అనేది  తెలంగాణ ప్రజల నినాదం కాదని, ఈ నినాదం టీఆర్ఎస్ తీసుకొచ్చిన నినాదమని  రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు టీఆర్ఎస్ ఈ నినాదాన్ని తీసుకొచ్చిందన్నారు.

 తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే  బంగారు తెలంగాణను చేస్తానని కేసీఆర్ హమీ ఇచ్చారని, కానీ  ఏ హమీని కూడ అమలు చేయలేదన్నారు. ప్రజలను  తమవైపుకు  తిప్పుకొనే ప్రయత్నం చేశారని చెప్పారు.

కేసీఆర్  సీఎం అయ్యాక ఒక్క హమీని కూడ అమలు చేయలేదన్నారు. కుటుంబ పాలనను తీసుకొచ్చి నక్సలైట్ల ఎజెండాను  తుంగలో తొక్కారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్


స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

click me!