చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

Published : Feb 04, 2019, 01:09 PM IST
చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

సారాంశం

 ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డి హైద్రాబాద్‌లో ఓ ఖరీదైన ఇండిపెండెంట్ ఇంటిలో నివాసం ఉంటున్నాడు.


హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డి హైద్రాబాద్‌లో ఓ ఖరీదైన ఇండిపెండెంట్ ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఈ ఇంట్లో కూడ పోలీసులు జయరామ్ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలపై ఆరా తీశారు.

గత నెల 31వ తేదీన చిగురుపాటి జయరామ్ హత్యకు గురయ్యారు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో  జయరామ్‌తో గొడవ జరిగిన సమయంలో  గట్టిగా కొట్టడంతో  జయరామ్ మృతి చెందినట్టుగా రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా చెబుతున్నారు.

నగర శివారులోని ఓ ఎమ్మెల్యేకు రాకేష్ రెడ్డి అనుచరుడిగా కొనసాగుతున్నట్టుగా పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసేవాడని రాకేష్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నట్టుగా పోలీసులు  అభిప్రాయపడుతున్నారు.

జల్సాగా జీవనాన్ని గడుపుతూ అమ్మాయిలకు వల వేసే వాడని  రాకేష్ రెడ్డి  గురించి పోలీసులు అనుమానిస్తున్నారు.  హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి నెలకు రూ.4 లక్షలు అద్దె చెల్లిస్తూ ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

ఈ ఇంట్లో రాకేష్ రెడ్డి ఒక్కడే నివాసం ఉంటున్నారు.ఇదే ఇంటికి జయరామ్‌ను తీసుకొచ్చారా అనే కోణంలో  కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.రాకేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు కాపలా పెట్టారు. 
సంబంధిత వార్తలు

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu