తిరిగి ప్రారంభమైన నుమాయిష్: తొంగిచూడని జనాలు

By Siva KodatiFirst Published Feb 4, 2019, 11:35 AM IST
Highlights

భారీ అగ్నిప్రమాదం అనంతరం స్వల్ప వ్యవధిలోనే అఖిల భారత పారిశ్రామి ప్రదర్శన (నుమాయిష్) తిరిగి ప్రారంభమైంది. గత నెల 30న జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 300 స్టాళ్లు అగ్నికి ఆహుతికాగా, కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. 

భారీ అగ్నిప్రమాదం అనంతరం స్వల్ప వ్యవధిలోనే అఖిల భారత పారిశ్రామి ప్రదర్శన (నుమాయిష్) తిరిగి ప్రారంభమైంది. గత నెల 30న జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 300 స్టాళ్లు అగ్నికి ఆహుతికాగా, కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది.

అయితే ఈ ఏడాది నుమాయిష్‌‌‌‌ను ఇంకా మూసివేస్తారని ప్రచారం జరిగినప్పటికీ అదేం లేదన్న నుమాయిష్ సొసైటీ కాలిపోయిన స్టాళ్లను తొలగించి ఎగ్జిబిషన్‌ను ఈ  నెల 2 నుంచి పునరుద్దరించారు. అయితే మునుపటితో పోలిస్తే నుమాయిష్‌కు ఆదరణ తగ్గింది.

అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇంకా కళ్లేదుట కదలాడుతుండటంతో సందర్శకులు ఇటువైపు తొంగిచూడలేదు. తొలి రోజున కేవలం 16 వేలమంది మాత్రమే ప్రదర్శనకు రాగా... ఆదివారం కనీసం లక్షమంది వస్తారని ఆశించారు.

అయితే రాత్రి నాటికి కేవలం 35 వేల మందే నుమాయిష్‌ను సందర్శించారని నిర్వాహకులు ఓ ప్రకటనలు తెలియజేశారు.  పరిస్ధితిని గమనించిన సొసైటీ నిర్వాహకులు ప్రజలు నిర్భయంగా రావచ్చునని, భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు చేపట్టామని ప్రచారం చేస్తున్నారు.
 

సిగరేట్ మంటనే: నుమాయిష్‌ ప్రమాదంపై ఈటల స్పందన

నాంపల్లి నుమాయిష్ అగ్ని ప్రమాదం దృశ్యాలు

వదంతులు నమ్మెుద్దు, ప్రాణ నష్టం జరగలేదు: సీపీ అంజనీకుమార్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం, అగ్నికి ఆహుతి అయిన స్టాల్స్, తొక్కిసలాట వీడియో

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం: భయంతో పరుగులు, తొక్కిసలాట

81 ఏళ్ల నుమాయిష్ చరిత్రలోనే తొలిసారి మహా విషాదం

click me!