తప్పుడు ప్రచారమే: ఇంటర్ మార్కుల అవకతవకలపై గ్లోబరీన్ సీఈఓ

By narsimha lode  |  First Published Apr 23, 2019, 12:27 PM IST

ఇంటర్ పరీక్షల్లో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని....ఈ విషయంలో తాము ఏ విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామని  గ్లోబరీనా సంస్థ సీఈఓ వీఎస్ఎన్ రాజు స్పష్టం చేశారు.


హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని....ఈ విషయంలో తాము ఏ విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామని  గ్లోబరీనా సంస్థ సీఈఓ వీఎస్ఎన్ రాజు స్పష్టం చేశారు.

మంగళవారం నాడు గ్లోబరీనా సంస్థ సీఈఓ ఓ తెలుగు న్యూస్ చానెల్‌‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో  తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

Latest Videos

undefined

తమ సంస్థకు ఇంటర్ బోర్డు టెండర్ దక్కడం వెనుక ఏ రాజకీయ నాయకుడి హస్తం లేదన్నారు. తమకు టెండర్ ఇవ్వాలని కూడ ప్రభుత్వంలోని పెద్దలు సిఫారసు కూడ చేయలేదన్నారు.

టెక్నికల్‌ బిడ్‌లో, ఫైనాన్స్ బిడ్‌లో తమ సంస్థ నెంబర్‌వన్‌గా నిలిచినందున ఈ టెండర్‌ను తమకు ఇంటర్ బోర్డు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలోని పలు యూనివర్శిటీలతో  తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

మీడియాలో తమ సంస్థపై రెండు రోజులుగా అవాస్తవాలు వస్తున్నాయని ఆయన ఆరోపణలు చేశారు. తమ సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

మాగ్నటిక్ సంస్థతో పాటు తమ సంస్థ కూడ ఈ బిడ్‌లో పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మాగ్నటిక్ సంస్థ కంటే తమ సంస్థ తక్కువ రేట్ కోడ్ చేయడం వల్ల  ఈ టెండర్ దక్కిందన్నారు.

దేశంలోని 26 యూనివర్శిటీలతో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకొన్నట్టు ఆయన గుర్తు చేశారు. ఏ సంస్థతో కూడ తమకు బ్లాక్ మార్కు రాలేదన్నారు.

కాకినాడ జేఎన్టీయూలో తమ సంస్థ బాగా సర్వీస్ చేసిందనే విషయమై సర్టిఫికెట్ కూడ ఇచ్చిందని ఆయన గుర్తు  చేశారు. కాకినాడ జేఎన్టీయూలో తమ సంస్థపై దుష్ప్రచారం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

జేఎన్టీయూ కాకినాడ సబ్బవరం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసినట్టుగా తనకు తెలియదన్నారు. ఇప్పటివరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. యూనివర్శిటీ అంతర్గతంగా నోటీసులు జారీ చేసి ఉండవచ్చన్నారు. 

జేఎన్టీయూ కాకినాడ విషయంలో  రెండు మాసాల్లో  తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. తమ సంస్థకు 18 ఏళ్ల అనుభవం ఉందని  ఆయన చెప్పారు.తమ సంస్థ నుండి ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇంటర్ బోర్డు తమకు సహకరించిందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే  ఇంటర్ బోర్డు దృష్టికి  తీసుకురావాలని  ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్థులు సహా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అరెస్ట్

ఇంటర్ విద్యార్థులకు మరో షాక్: మొరాయిస్తున్న పోర్టల్

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

విద్యార్థుల ఆత్మహత్యల పాపం ఎవరిది: హత్య (తెలుగు కథ)

అందుకే గ్లోబరిన్‌కు అప్పగించాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్

ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థి సేవా దళ్ కార్యకర్తలు ధర్నా (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్: అమ్మాయి అరెస్టు (వీడియో)

ఇంటర్ బోర్డు ముందు ధర్నా: రేవంత్ రెడ్డి అరెస్టు(వీడియో)

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

ఇంటర్ ఫలితాలు.... మొన్న సున్నా.. నేడు 99

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై కమిటీని నియమించిన ప్రభుత్వం

బోర్డు నిర్వాకం: ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ భరోసా

గుండె తరుక్కుపోతోంది: విద్యార్థుల ఆత్మహత్యలపై హరీష్ రావు

తప్పుల తడక: పిల్లలు ఉసురు పోసుకుంటున్న ఇంటర్ బోర్డు (వీడియో)

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం: ఐఐటీ కొట్టిన విద్యార్ధి మ్యాథ్స్‌‌లో ఫెయిల్

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య

click me!