రంగంలోకి ట్రబుల్ షూటర్: రెబెల్స్‌తో డీకే శివకుమార్ చర్చలు

By narsimha lodeFirst Published Nov 18, 2018, 11:44 AM IST
Highlights

అసంతృప్తులను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.


హైదరాబాద్: అసంతృప్తులను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది నేతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుజ్జగించనుంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ముగ్గురితో కమిటీని కూడ ఏర్పాటు చేసింది.

మిత్రపక్షాలకు సీట్ల సర్దుభాటు కారణంగానో లేదా సామాజిక సమీకరణాల నేపథ్యంలోనో ఇతరత్రా కారణాలతోనో టికెట్లు దక్కని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావాహులను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బుజ్జగిస్తోంది.

అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది.  పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ఛైర్మెన్‌గా ముగ్గురితో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో  కృష్ణారావుతో పాటు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌కు కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  చోటు కల్పించింది. 

ఇప్పటికే ఈ కమిటీ సభ్యులు హైద్రాబాద్‌ పార్క్‌హయత్‌ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ కమిటీ సభ్యులను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిలు కలిశారు.

 తనకు టికెట్టు  కేటాయింపు  విషయమై జరిగిన అన్యాయంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి కమిటీ ముందు  వివరించారు. మరోవైపు బీసీలకు టికెట్ల కేటాయింపులో ఇంకా ఎక్కువ స్థానాలు కేటాయించాలని కమిటీ సభ్యులను కోరినట్టు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.టికెట్ల కేటాయింపులో జరిగిన లోటుపాట్లను సరిదిద్దాలని కోరినట్టు లక్ష్మయ్య మీడియాకు చెప్పారు.

మరో వైపు వరంగల్ వెస్ట్ సీటును ఆశించి ఆ సీటు దక్కకపోవడంతో  నామినేషన్ దాఖలు చేసిన వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కూడ ఈ కమిటీ సభ్యులను  కలుసుకొన్నారు. వరంగల్ వెస్ట్ స్థానం టీడీపీకి కేటాయించింది. టీడీపీ అభ్యర్థిగా  రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ స్థానం నుండి బరిలోకి దిగుతున్నారు.

సంబంధిత వార్తలు

రంగంలోకి ట్రబుల్ షూటర్: రెబెల్స్‌తో డీకే శివకుమార్ చర్చలు

జనగామపై ట్విస్ట్: కోదండరామ్‌ చేతిలోనే పొన్నాల భవితవ్యం

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

click me!