విరసం నేత వరవర రావు అరెస్టు: పూణేకు తరలింపు

By pratap reddyFirst Published 17, Nov 2018, 9:31 PM IST
Highlights

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నివాసంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నివాసంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

ఆ తర్వాత ఆయనను పూణేకు తరలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో వరవర రావు పేరు కూడా చోటు చేసుకుంది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

గతంలో ఆయనను అరెస్టు చేసి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాదు తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. 

అయితే, హైకోర్టులో వరవర రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు ఆయనను శనివారం అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

ఇంటికి చేరుకున్న వరవరరావు: సుప్రీం ఆదేశాలపై స్పందన 

సుప్రీంకోర్టులో వరవరరావుకు ఊరట...

40 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు: వరవరరావు భార్య హేమలత

వరవరరావు అరెస్టు: కంట తడి పెట్టిన భార్య హేమలత

పూణె పోలీసుల సోదాలు: వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత

మోడీ హత్యకు కుట్రలో పేరు: విరసం నేత వరవరరావు అరెస్ట్

Last Updated 17, Nov 2018, 9:31 PM IST