కేసీఆర్‌ కుటుంబ సభ్యుల గుప్పిట్లోనే రాష్ట్ర పాలన సాగుతోందని ఆరోపించారు.

తెలంగాణలో కేసీఆర్ పాలనపై సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూ.. సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి ఆమె ఇక్కడికి వచ్చారు. రాష్ట్రంలో 4‘కె’ల( కేసీఆర్, కేటీఆర్, కవిత, కుటుంబం)తో 4కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని మల్లు రవి నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబ సభ్యుల గుప్పిట్లోనే రాష్ట్ర పాలన సాగుతోందని ఆరోపించారు. సచివాలయానికి రాకుండా పరిపాలన సాగించిన ఏకైక సీఎం కేసీఆర్‌ అని విమర్శించారు. చైల్డ్‌ అండ్‌ ఉమెన్‌ వెల్ఫేర్‌ కమిషన్‌కు చైర్మన్‌గా మగ వారిని నియమించిన ఘనత సైతం ఆయనకే దక్కుతుందన్నారు.