కేసీఆర్ రాసిన పాటలకు ఈసీ క్లియరెన్స్

By narsimha lodeFirst Published Nov 19, 2018, 3:07 PM IST
Highlights

ఎన్నికల ప్రచారం కోసం  టీఆర్ఎస్  పాటలను  తయారు చేసింది


హైదరాబాద్: ఎన్నికల ప్రచారం కోసం  టీఆర్ఎస్  పాటలను  తయారు చేసింది.  ఈ పాటలను  ఎన్నికల కమిషన్  అనుమతి కోసం పంపింది.  ఆదివారం నాడు  ఎన్నికల కమిషన్ కు  టీఆర్ఎస్  ఎన్నికల పాటల సీడీని అందించింది.

 ప్రచారానికి సంబంధించి రూపొందించిన ఈ పాటలకు  ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.  తెలంగాణ రాష్ట్ర సమితి  ఎంపీ  వినోద్ ఆదివారం నాడు ఈ పాటలను  సీడీని ఎన్నికల సంఘానికి  అందించారు. ఈ పాటలకు సోమవారం నాడు ఎన్నికల సంఘం అనుమతిని ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భాన్ని  పురస్కరించుకొని  రెండు పాటలను  కేసీఆర్ రాశారు. గతంలో కూడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ ఓ పాట రాశారు.

ఈ దఫా ఎన్నికలను పురస్కరించుకొని రెండు పాటలను రాశారు. టీఆర్ఎస్ రూపొందించిన ఆడియోకు  ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. మరోవైపు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా  నిజామాబాద్ ఎంపీ  కవిత కు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్, టీఆర్ఎస్ సీట్ల కేటాయింపు: రెడ్లదే పై చేయి

 

కాంగ్రెస్‌తో తేలని పంచాయితీ: మిత్రుల స్థానాల్లో టీజేఎస్ పోటీ

సీట్ల సర్దుబాటు: కాంగ్రెస్‌కు కోదండరామ్ డెడ్‌లైన్

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొగ

 

 

 

click me!