DeepTech india: చైనా తీసుకొచ్చిన డీప్‌టెక్ ఏఐను ప్రోత్సహిస్తే దాని ప్రభావం నేరుగా స్టార్టప్ రంగంపై పడుతుందని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందాని అంటున్నాడు.. ఇటీవల ఇండియాలో డీప్‌టెక్ ఆవిష్కరణల పరిస్థితిపై కేంద్ర కామర్స్ ఇండస్ట్రీస్ మంత్రి పియూష్ గోయల్ ఓ చర్చావేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డీప్‌టెక్ మనుగడ, సామర్థ్యం, దేశానికి జరిగే నష్టంపై సంజీవ్ బిఖ్‌చందాని వివరణాత్మకంగా తన ఎక్స్ వేదికగా తెలియజేశారు.
ఇండియాలో డీప్‌టెక్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సంజయ్ పేర్కొన్నాడు. దీనివల్ల దేశంలో స్టార్టప్‌ల సంఖ్య తగ్గుతుందని, ఆ రంగంలో పెట్టుబడులు కూడా తగ్గుతాయన్నారు. అంతేకాకుండా... ఇప్పటికే ఏఐ రంగంలో స్టార్టప్‌లు ప్రారంభించి అభివృద్ది చేస్తున్నవారిపై డీప్‌టెక్ ప్రభావం ఉంటుందని నూతన స్టార్టప్‌లకు పెట్టుబడి పెట్టేవారు తగ్గిపోతారని ఆయన హెచ్చరించారు.
వృద్దిరేటు తక్కువగా...
ఇక డీప్‌టెక్‌లో పెట్టుబడిదారుల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది. దీని వల్లే ఈ రంగంలో వృద్దిరేటు తక్కువగా ఉందన్నారు. Inc42 డేటా ప్రకారం.. డీప్‌టెక్ స్టార్టప్‌లు 2014 మరియు 2024 మధ్య సుమారు $2 బిలియన్లను సముపార్జించగా.. భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో అతిపెద్ద పేర్లలో ఒకటైన ఇన్ఫో ఎడ్జ్ సుమారు $4.6 బిలియన్లు వరకు సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. బిఖ్‌చందానీ మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఇన్ఫో ఎడ్జ్ తన నిధుల నుంచి అనుబంధ సంస్థ రెడ్ స్టార్ట్ ద్వారా మ్యాటర్ మోటార్స్, మనస్తు స్పేస్, అన్‌బాక్స్ రోబోటిక్స్‌తో సహా 18 డీప్‌టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టిందన్నారు. కంపెనీ ప్రతి త్రైమాసికంలో 1-2 డీప్‌టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడి పెడుతూనే ఉందని ఆయన అన్నారు.
డీప్‌టెక్ స్టార్టప్ పెట్టుబడి పెట్టడం సంక్లిష్టమైనదని ఆయన అన్నారు. డీప్‌టెక్ స్టార్టప్‌లు మార్కెట్‌లోకి వెళ్లి లాభాలను తెచ్చే పరిస్థితి లేదన్నారు. అది చాలా కష్టమైన ప్రక్రియ అని అన్నారు. ఇండియాలో అలాంటి స్టార్టప్‌లపై గత కొన్నేళ్లుగా పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదన్నారు. తక్కువ కాలంలోనే లైఫ్‌టైం ఉండే డీప్‌టెక్‌కి నిధులు అధికంగా పెట్టి దీర్ఘకాలంలో నష్టపోవాల్సి వస్తుందన్నారు.