Google pixel 8: గూగుల్ పిక్సెల్ 8పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 19 వేలు తగ్గింపు.

Published : May 08, 2025, 01:45 PM IST
Google pixel 8: గూగుల్ పిక్సెల్ 8పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 19 వేలు తగ్గింపు.

సారాంశం

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? గూగుల్ పిక్సెల్ 8పై సూపర్ డీల్ ఉంది. ఈ ఫోన్‌పై డైరెక్ట్ డిస్కౌంట్ ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. 

Google pixel 8: కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా, మంచి ఆఫర్ కోసం వెతుకుతున్నారా? ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌పై సూపర్ ఆఫర్ అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై ₹19,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 

పిక్సెల్ 8పై సూపర్ డీల్

గూగుల్ పిక్సెల్ 8 లాంచ్ ధర ₹75,999 కాగా.. క్రోమాలో దీనిపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర ₹63,999. అంటే ₹12,000 డైరెక్ట్ డిస్కౌంట్ ఉంది. మీ దగ్గర HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, EMIపై ₹7,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మంచి కండిషన్‌లో ఉన్న పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీని ద్వారా బాగా డబ్బు ఆదా చేసి, కొత్త పిక్సెల్ 8పై మొత్తం ₹19,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్స్ ఏంటంటే.? 

ఈ ఫోన్‌లో 6.2 అంగుళాల FHD+ OLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. గూగుల్ సొంత టెన్సార్ G3 చిప్ ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. అంటే లాగ్ లేకుండా, ఆగకుండా అన్ని పనులు ఫాస్ట్‌గా జరుగుతాయి. 2000 నిట్స్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. 

గూగుల్ పిక్సెల్ 8 కెమెరా

గూగుల్ పిక్సెల్ 8 వెనుక 50MP + 12MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందు 10.5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 4575mAh పవర్‌ఫుల్ బ్యాటరీ, 27W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. 18W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. IP68 రేటింగ్ తో నీరు, దుమ్ము నుంచి రక్షణ కల్పిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్