ఎక్కువగా ఏడిస్తే కళ్ళు వాస్తాయి. కళ్ళలోని కణజాలంలో ఒత్తిడి కలుగుతుంది. ముఖం అలసిపోయినట్లు కనిపిస్తుంది.
తరచుగా ఏడ్వడం వల్ల కళ్ళలో మంట, దురద వస్తుంది. అంతేకాకుండా కన్నీళ్లలో ఉండే ఉప్పు కంటిలోని తేమను తొలగించి పొడిబారడానికి కారణమవుతుంది.
తరచుగా ఏడ్వడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఒత్తిడి, నిద్రలేమి వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఎక్కువగా ఏడిస్తే కళ్ళు ఎర్రగా మారతాయి. అలాగే రక్తనాళాలు వ్యాకోచించి, కళ్ళు వాచి, నీరు కారడం ప్రారంభమవుతుంది. చూపు కూడా మసకబారుతుంది. రోజంతా అలసటగా అనిపిస్తుంది.
ఎక్కువగా ఏడిస్తే కళ్ళలోని సహజ తేమ చెదిరిపోయి పొడిబారతాయి. కళ్లు మంట పుడతాయి.
భావోద్వేగంతో ఏడ్చినప్పుడు ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ పెరుగుతుంది. ఇది కంటి పొరను దెబ్బతీస్తుంది. దీంతో కళ్లు వాస్తాయి.
ఎక్కువగా ఏడుస్తూ ఉంటే కళ్ళ చుట్టూ ఉన్న చర్మం సన్నబడుతుంది. దీనివల్ల ముడతలు, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.