AI-Driven Social Media: ప్రస్తుతం ఏఐ మనిషితోపోటీ పడుతోంది. అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకొస్తోంది. రీసెంట్‌గా ఏఐతో సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం రానున్నట్లు ఒపెన్ ఏఐ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ఉన్న ఎలాన్ మస్క్ ఎక్స్(ట్విట్టర్ ఒకప్పుడు), మెటా వారి ఇనస్టాగ్రం మాధ్యమాలకు పోటీగా ఈ ఒపెన్ ఏఐ వారు ఏఐతోనే పూర్తిగా నడిచే సోషల్‌మీడియా ఫాట్‌ఫాంలను అతి త్వరలో అందుబాటులోకి తెచ్చేపనిలో ఉన్నారు.
ఇప్పటికే ఏఐ సోషల్ మీడియా ఫాట్‌ఫాం ఏర్పాటుపై పలుమార్లు కంపెనీ ప్రయోగాత్మకంగా టెస్ట్ చేసింది. సర్వర్ ఓవర్‌లోడ్‌తో ప్రారంభానికి నోచుకోలేదు. దీంతోపాటు కొన్ని లీగల్ సమస్యల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వస్తోంది. వాస్తవానికి దీనిని మార్చిలో ప్రారంభించినప్పటికీ అనివార్య కారణాలతో అందుబాటులోకి రాలేదు. ఇక ఈ ఫాట్‌ఫాం వినియోగదారులు వారి ఫోటోలు, లోగోలు, కస్టమ్ ఆర్ట్‌వర్క్‌తో సహా వివిధ రకాల చిత్రాలను ఏఐతో తయారు చేయవచ్చు. ఇక ఈ ప్రాజెక్టు గురించి పూర్తివివరాలను తెలియజేయలేదు, గోప్యంగా ఉంచారు. త్వరలో ఒపెన్ ఏఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అప్‌లోడ్ చేసిన ఫోటోలను యానిమేషన్...
ఒపెన్ ఏఐ సోషల్ మీడియా ఫాట్‌ఫాం ద్వారా వినియోగదారులు అప్‌లోడ్ చేసిన ఫోటోలను ఆనిమేషన్ చేయడం, వివిధ రకాలుగా మనకు కావాల్సిన విధంగా మార్చుకునేలా టెక్నాలజీ అభివృద్ది చేయనున్నారు. ఈ ఇమేజ్-జనరేషన్ టెక్నాలజీ తీసుకురావడంతో ఎలాన్‌మస్క్ ఎక్స్‌తో ఏఐ గట్టి పోటీ ఇవ్వనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఒపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ తన ప్రొఫైల్ చిత్రాన్ని కొత్త ఫీచర్‌ను ఉపయోగించి తయారు చేసి ట్రెండింగ్‌లోకి వెళ్లారు. అయితే.. అనేక సర్వీసులు ఒకేచోట అందించడం వల్ల సర్వర్ ఒవర్‌లోడ్ అవడం, టెక్నికల్ ఎర్రర్ వల్ల కంపెనీ జీపీయూలు వేడెక్కుతున్నాయని ఆల్ట్మాన్ పేర్కొన్నారు. దీనిని పరిష్కరించడానికి, OpenAI దాని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తోందని, ఈ ఫీచర్‌కు తాత్కాలికంగా యాక్సెస్‌ను పరిమితం చేసినట్లు తెలిపారు.
ఎలాన్ మస్క్‌కు xAI వంటి ఏఐ కంపెనీ ఉంది. మస్క్ యొక్క xAI ఇటీవల Xను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనిని గతంలో ట్విట్టర్ అని పిలిచేవారు. తన కంపెనీకి ఏఐ పోటీ వస్తుండటంతో దానిపై లీగల్‌గా కేసులు వేశారంట మస్క్. ఫ్రాఫిటబుల్, నాన్‌ఫ్రాఫిటబుల్ కింద మస్క్ ఒపెన్ ఏఐపై కేసులు వేశారు. ఈ నేపథ్యంలో మస్క్ గ్రూప్ ఫిబ్రవరిలో $97.4 బిలియన్లకు OpenAIని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది, కానీ ఆ బిడ్ వెంటనే ఏఐ సంస్థ తిరస్కరించింది. చట్టపరమైన పోరాటాలు, పోటీ ఉన్నప్పటికీ, OpenAI ఇటీవల ఒక ప్రధాన ఆర్థిక మైలురాయిని సాధించింది. తన ఈ నూతన ప్రాజెక్టుకు $40 బిలియన్ల నిధులను సమాకూర్చుకుంది. దీంతో కంపెనీ విలువ $300 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఈ నిధులతో OpenAI తన సేవలను మరింత విస్తరించే పనిలో పడింది. దీంతోపాటు మస్క్, ఇతర సంస్థలకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది.