Donald Trump On Tiktok: టిక్‌టాక్‌ను అమెరికన్ కంపెనీ కొనుగోలు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ 75 రోజుల సమయం ఇచ్చారు. టిక్‌టాక్ అమెరికాలో బాగా పాపులర్, దీనికి 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వీడియో షేరింగ్ యాప్‌కు ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది.
Donald Trump On Tiktok: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్‌కు మరికొంత సమయం ఇచ్చారు. చైనా కంపెనీ కాని కంపెనీని కొనుగోలుదారుగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. టిక్‌టాక్‌కు సమస్యను పరిష్కరించుకోవడానికి 75 రోజులు గడువు ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం పని చేస్తోందని, టిక్‌టాక్‌ను కొనసాగించడానికి 75 రోజుల గడువు ఇస్తూ ఆర్డర్‌పై సంతకం చేశానని ట్రంప్ సోషల్ మీడియాలో చెప్పారు.
ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్‌పై పోస్ట్ షేర్ చేస్తూ.. "టిక్‌టాక్‌ను కాపాడటానికి ప్రభుత్వం కష్టపడుతోంది, ఈ విషయంలో మంచి పురోగతి సాధించాం" అని రాశారు. ఇంకా మాట్లాడుతూ.. "ఈ లావాదేవీ పూర్తి చేయడానికి అవసరమైన అనుమతులపై ఇంకా పని జరగాల్సి ఉంది. అందుకే టిక్‌టాక్‌ను 75 రోజులు కొనసాగించడానికి అనుమతిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నాను" అన్నారు.
టిక్‌టాక్ అమెరికాలో బాగా పాపులర్, దీనికి 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వీడియో షేరింగ్ యాప్‌నకు ఇప్పుడు ట్రంప్ ఆదేశాలతో ప్రమాదం ఏర్పడింది. అమెరికాలో గత సంవత్సరం ఒక చట్టం పాస్ అయింది. ఈ చట్టం ప్రకారం టిక్‌టాక్ తన చైనా కంపెనీ బైట్‌డాన్స్ నుండి విడిపోవాలి. లేకపోతే అమెరికాలో బ్యాన్ చేస్తారు.