తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
12:06 AM (IST) Jun 23
Case Registered Against Jagan: చీలి సింగయ్య మరణం కేసులో నిందితులుగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. జగన్ సహా పలువురు మాజీ మంత్రులపై కూడా నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
11:23 PM (IST) Jun 22
Pawan Kalyan: మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను పదహారేళ్ల వయస్సులో శబరిమల వెళ్లాననీ, విభూతి పెట్టుకొని బడికి వెళ్లేవాడినని తెలిపారు. అలాగే, హిందువుగా గర్వంగా ఉన్నాననీ, అన్ని మాతాలను గౌరవిస్తానని తెలిపారు.
10:27 PM (IST) Jun 22
8th pay commission salary hike: 8వ వేతన సంఘానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 2026 జనవరి 1న అమలులోకి వచ్చే ఈ భర్తీతో వేతనాలు, పెన్షన్లు భారీగా పెరిగే అవకాశముంది.
09:57 PM (IST) Jun 22
IND vs ENG: లీడ్స్ లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో హ్యారీ బ్రూక్ 99 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీని మిస్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది.
07:16 PM (IST) Jun 22
Pawan Kalyan: మురుగ భక్తర్గళ్ మానాడు కోసం ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధురై చేరుకున్నారు. తమిళనాడు బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పంచెకట్టులో పవన్ లుక్ అదిరిపోయింది. ఫోటోలు వైరల్ గా మారాయి.
04:51 PM (IST) Jun 22
Jasprit Bumrah: సెనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియాన్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా వసీం అక్రమ్ రికార్డును బ్రేక్ చేశాడు. లీడ్స్ టెస్ట్‌లో అద్భుతమైన బౌలింగ్ తో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టులోని కీలకమైన 3 వికెట్లు తీసుకున్నాడు.
02:54 PM (IST) Jun 22
Karun Nair: దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ఆటతో అదరగొట్టిన కరుణ్ నాయర్ 3,011 రోజులకు తర్వాత భారత టెస్ట్ జట్టులోకి వచ్చాడు. అయితే, హెడింగ్లీలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అతను నాలుగు బంతుల్లోనే డక్ అవుట్ అయ్యాడు.
11:55 AM (IST) Jun 22
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా యుద్ధంలోకి నేరుగా దిగడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా చేసిన దాడులతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
10:55 AM (IST) Jun 22
ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్‌ను తెగ ఉపయోగిస్తున్నారు. అయితే వీటితో ఎంత మంచి జరుగుతుందో అదే స్థాయిలో చెడు కూడా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
09:48 AM (IST) Jun 22
చెప్పినట్లే ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. శనివారం రాత్రి ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ సైతం ధృవీకరించింది. ఈ నేపథ్యంలో దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
08:30 AM (IST) Jun 22
కలియుగ దైవం తిరులమ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
07:56 AM (IST) Jun 22
ఈ ఏడాది రోహిణి కార్తె ముందు కురిసిన వర్షాలతో అంతా ఖుషీ అయ్యారు. ఈసారి కాలం ముందుగా వచ్చిందని, వర్షాలు బాగా కురుస్తాయని ఆశించారు. అయితే పరిస్థితి దానికి భిన్నంగా మారింది.
07:14 AM (IST) Jun 22
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు మరింతి తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్ధతు ఇస్తూ వస్తున్న అమెరికా ఆ దిశగా కీలక అడుగు వేసింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు.