MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Pawan Kalyan : మురుగ భక్తర్గళ్‌ మానాడులో పవన్ కళ్యాణ్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Pawan Kalyan : మురుగ భక్తర్గళ్‌ మానాడులో పవన్ కళ్యాణ్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Pawan Kalyan: మురుగ భక్తర్గళ్‌ మానాడు కోసం ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధురై చేరుకున్నారు. తమిళనాడు బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పంచెక‌ట్టులో ప‌వ‌న్ లుక్ అదిరిపోయింది. ఫోటోలు వైరల్ గా మారాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 22 2025, 07:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
మధురై పర్యటనలో పవన్ కళ్యాణ్
Image Credit : X/@JanaSenaParty

మధురై పర్యటనలో పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మురుగ భక్తర్గళ్‌ మానాడు కోసం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం మధురై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న పవన్ కు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

పవన్ కు స్వాగతం పలికిన నేతలలో తమిళనాడు బీజేపీ అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చక్రవర్తి, రాష్ట్ర నాయకుడు అమర్ ప్రసాద్ రెడ్డి, మధురై జిల్లా అధ్యక్షుడు చక్రవర్తి, జనరల్ సెక్రటరీ రామ శ్రీనివాసన్, సీనియర్ రాజకీయ నాయకుడు రాధాకృష్ణన్‌లు ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
తిరుపర కుంద్రమ్ ఆలయ దర్శనంలో పవన్ కళ్యాణ్
Image Credit : X/@JanaSenaParty

తిరుపర కుంద్రమ్ ఆలయ దర్శనంలో పవన్ కళ్యాణ్

తన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాన్ సాయంత్రం తిరుపర కుంద్రమ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం తమిళనాట మురుగ భక్తులకు విశేష ప్రాధాన్యత కలిగి ఉంటుంది.

తిరుపర కుంద్రమ్ దర్శనం అనంతరం, మధురైలోని అమ్మ తిడాల్ ప్రాంగణంలో నిర్వహించనున్న “మురుగ భక్తర్గళ్ మానాడు” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ మతపరమైన కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

38
తమిళ సంప్రదాయ దుస్తుల్లో పవన్ ఫొటోలు వైరల్
Image Credit : X/@JanaSenaParty

తమిళ సంప్రదాయ దుస్తుల్లో పవన్ ఫొటోలు వైరల్

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా తమిళ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. తెల్లటి జరీ బోర్డర్ ఉన్న తెల్ల చొక్కాలో ఆయన కనిపించారు. సినిమా షూటింగ్ స్టైల్లో ఆయన లుక్ అదిరిపోయింది. తమిళ సాంప్రదాయాన్ని గౌరవించినట్టు భావిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో వినూత్న స్పందన వ్యక్తం చేశారు. విమానం నుండి దిగుతున్న దృశ్యాలు నిమిషాల్లో వైరల్ అయ్యాయి.

மதுரை விமான நிலையத்தில் ஆந்திரா துணை முதல்வர் பவன் கல்யாண்!#PawanKalyan | #Madurai | #MuruganMaanadu | #MurugaBhaktargalConference | #MurugaBhaktargalMaanadu | #HinduMunnani pic.twitter.com/dtci8h6FWp

— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) June 22, 2025

48
మురుగ భక్తర్గళ్‌ మానాడు అంటే ఏమిటి?
Image Credit : X/@JanaSenaParty

మురుగ భక్తర్గళ్‌ మానాడు అంటే ఏమిటి?

జూన్ 22న మధురైలో ప్రారంభమైన మురుగ భక్తర్గళ్‌ మానాడు మురుగ భక్తుల ఆధ్యాత్మిక మహాసభ. ఇది తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. హిందూ మున్నాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 15 రోజుల కార్యక్రమం ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టమైనదిగా భావిస్తున్నారు. అయితే, రాజకీయ పరంగా మాత్రం తీవ్ర వివాదానికి దారి తీసింది.

58
మురుగ భక్తి పట్ల రాజకీయ ఉత్సాహం
Image Credit : X/@JanaSenaParty

మురుగ భక్తి పట్ల రాజకీయ ఉత్సాహం

తమిళ సంప్రదాయానికి కీలకమైన ఆరు పవిత్ర స్థలాల్లో నివసించిన దేవునిగా భావించే మురుగన్‌ను ఆశిస్సులు కోరుతూ ఈ మహాసభ నిర్వహిస్తున్నారు. దేవదేవుడైన మురుగన్‌ను కేంద్రంగా పెట్టుకొని బీజేపీ తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.

ఈ మానాడులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  సహా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇది ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపునిచ్చే అవకాశముంది.

68
మురుగ భక్తర్గళ్‌ మానాడు అనుమతి చుట్టూ వివాదాలు
Image Credit : X/@JanaSenaParty

మురుగ భక్తర్గళ్‌ మానాడు అనుమతి చుట్టూ వివాదాలు

తమిళనాడు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మూడు రోజులకు పరిమితం చేయాలని నిర్ణయించగా, ఇది తీవ్ర విమర్శలకు గురైంది. భద్రతా కారణాలను పేర్కొంటూ పోలీసులు పరిమితులు విధించగా, మధురై బెంచ్ మద్రాస్ హైకోర్టు జూన్ 13న నిర్వాహకులకు అనుమతులు ఇచ్చింది. 

ఇటీవల బెంగళూరులో జరిగిన ఐపీఎల్ విజయ ర్యాలీలో గందరగోళం, తొక్కిసలాట జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ పోలీసులు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని కోర్టులో వివరించారు.

78
 గతంలో డీఎంకే పార్టీ పళని కార్యక్రమంతో పోలిక
Image Credit : X/@JanaSenaParty

గతంలో డీఎంకే పార్టీ పళని కార్యక్రమంతో పోలిక

ఇదిలాఉండగా, గత సంవత్సరం ఆగస్టులో డీఎంకే పార్టీ పళనిలో నిర్వహించిన 'ముత్త మురుగన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్'ను ఈ నేపథ్యంతో పోల్చడం జరుగుతోంది. ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన సంస్కృత ధర్మంపై వ్యాఖ్యల తరువాత మురుగన్ భక్తుల్లో ప్రతిస్పందనగా డీఎంకే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

88
బీజేపీ పై విమర్శలు
Image Credit : X/@JanaSenaParty

బీజేపీ పై విమర్శలు

బీజేపీ మాత్రం మురుగన్‌ను తమ సాంస్కృతిక గుర్తింపుగా, ఎన్నికల వ్యూహంగా వినియోగించుకుంటోందనే విమర్శలు ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మదురైలో తిరుపర కుంద్రమ్ ఆలయాన్ని ప్రస్తావిస్తూ మురుగన్ భక్తిని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని హిందూ మున్నానీ నిర్వహిస్తున్నా, బీజేపీ రాష్ట్రాల నాయకులు, ముఖ్యమైన అతిథులను స్వయంగా ఆహ్వానించడం గమనార్హం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
పవన్ కళ్యాణ్
ఆంధ్ర ప్రదేశ్
జనసేన
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే
Recommended image2
Now Playing
TDP MLA Miriyala Sirisha Devi Emotional Speech About Pawan Kalyan | Adavi Thalli Bata 2.0
Recommended image3
Weather Update: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉపరితల ఆవర్తన ఎఫెక్ట్ తో ఈ ప్రాంతాల్లో వర్షాలు
Related Stories
Recommended image1
Pawan Kalyan: జగన్ కి పవన్ మాస్ వార్నింగ్..నీ రప్పా..రప్పా డైలాగులు సినిమాల వరకే..!
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved