MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: హ్యారీ బ్రూక్ సెంచరీ మిస్.. బుమ్రాకు 5 వికెట్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్

IND vs ENG: హ్యారీ బ్రూక్ సెంచరీ మిస్.. బుమ్రాకు 5 వికెట్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్

IND vs ENG: లీడ్స్ లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో హ్యారీ బ్రూక్ 99 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీని మిస్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 22 2025, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుమ్రా దెబ్బతో ఇంగ్లాండ్ ఆలౌట్
Image Credit : x

బుమ్రా దెబ్బతో ఇంగ్లాండ్ ఆలౌట్

India vs England: లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు భారత బౌలింగ్ ను ఇంగ్లాండ్ ప్రతిఘటించింది. హ్యారీ బ్రూక్ అద్భుతమైన 99 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీని కోల్పోయాడు. 

జెమీ స్మిత్ 40 పరుగులు, క్రిస్ వోక్స్ 38 పరుగులు, బ్రైడన్ కార్స్ 22 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులు చేసింది.

మూడో రోజు భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుతమైన బౌలింగ్ తో ఐదు వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్‌కు కొంత స్థిరత ఇచ్చాడు. కానీ, చివరికి ఇంగ్లాండ్ విజయవంతంగా తన వ్యూహం అమలు చేసి భారత జట్టు స్కోర్ దగ్గరకు చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండో సెషన్ ప్రారంభంలో స్మిత్-బ్రూక్ దూకుడు
Image Credit : X

రెండో సెషన్ ప్రారంభంలో స్మిత్-బ్రూక్ దూకుడు

మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్‌ మొదట్లో హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ దూకుడుగా ఆడుతూ ఇంగ్లాండ్‌ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన షార్ట్ బాల్‌లపై స్మిత్ ఫోర్, సిక్స్‌లతో మెరుపులు చూపించాడు. అదే సమయంలో బ్రూక్ జడేజా బౌలింగ్‌లో స్కూప్ షాట్‌తో బౌండరీ కొట్టాడు. స్మిత్ పుల్ ప్రయత్నం విఫలమైనప్పుడు భారత జట్టు రివ్యూకు వెళ్లినా అది విఫలమైంది.

అయితే, కొంత సమయం తర్వాత షార్ట్ బాల్ వ్యూహం పనిచేసింది. స్మిత్‌ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. సాయి సుదర్శన్ కు అతను బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు.

Related Articles

Related image1
India vs England: ఇంగ్లాండ్ లో 2007లో చరిత్ర సృష్టించిన ద్రావిడ్ సేన.. గిల్ జట్టు రిపీట్ చేస్తుందా?
Related image2
Rishabh Pant: సచిన్ టెండూల్కర్ మెచ్చిన రోలీపోలీ షాట్.. రిషబ్ పంత్ ఎలా కొట్టాడో మీరు చూశారా?
35
రెండో కొత్త బంతితో భారత ఆశలపై దెబ్బపడింది
Image Credit : Getty

రెండో కొత్త బంతితో భారత ఆశలపై దెబ్బపడింది

ఇండియా రెండవ కొత్త బంతిని వెంటనే తీసుకుంది. బుమ్రా ప్రారంభించారు. వోక్స్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. బ్రూక్ సిరాజ్‌ బౌలింగ్ లో తనదైన స్టైల్లో ఎదుర్కొన్నాడు. డౌన్ ది గ్రౌండ్‌, కవర్‌ల మీదుగా ఫోర్లు కొట్టాడు. ఈ సమయంలో బ్రూక్ బ్యాట్ ఎడ్జ్ చేయగా, గల్లీలో ఉన్న యశస్వీ జైస్వాల్ సులువు క్యాచ్‌ను వదిలేశాడు.

90ల్లోకి ప్రవేశించిన బ్రూక్, సిరాజ్ బౌలింగ్‌ను సిక్సర్‌తో సెంచరీకి చేరువయ్యాడు. లంచ్ తర్వాత 9 ఓవర్లలో ఏకంగా 67 పరుగులు వచ్చాయి.

బ్రూక్ ఔట్ అయినా.. స్కోర్ బోర్డు పరుగులు ఆగలేదు

డ్రింక్స్ తర్వాత వోక్స్ బుమ్రా బౌలింగ్‌లో ఆఫ్ డ్రైవ్‌తో ఫోర్ కొట్టాడు. ప్రసిద్ధ్ తిరిగి వచ్చి, బ్రూక్‌ను షార్ట్ బాల్‌కు ట్రాప్ చేసి 99 పరుగుల వద్ద ఔట్ చేశాడు. దీంతో హ్యారీ బ్రూక్ కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీని కోల్పోయాడు. హ్యారీ బ్రూక్ తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. వోక్స్ మరో ఫోర్ తో ఇంగ్లాండ్‌ను 400 పరుగుల మార్క్ దాటించాడు. కార్స్ కూడా స్ట్రీకి షాట్లతో బౌండరీలు సాధించాడు.

వోక్స్ మరో సిక్సర్, థర్డ్‌మాన్ మీదుగా ఫోర్ కొట్టి సిరాజ్‌పై ఒత్తిడిని పెంచాడు. కార్స్‌తో కలిసి 36 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వోక్స్ 38 పరుగులు, కార్స్ 22 పరులు చేసి అవుట్ అయ్యారు.

45
బుమ్రా అద్భుతమైన ముగింపు
Image Credit : ANI

బుమ్రా అద్భుతమైన ముగింపు

కీలక సమయంలో సిరాజ్ కార్స్‌ను బౌల్డ్ చేశాడు. టీ విరామానికి ముందు బుమ్రా తిరిగి వచ్చి, వోక్స్‌ను నిప్ బ్యాకర్‌తో బౌల్డ్ చేసి తన నాలుగో వికెట్ సాధించాడు. జోష్ టంగ్ బ్యాట్ ఎడ్జ్ చేయగా అది బౌండరీకి వెళ్లింది. కానీ బుమ్రా చివరికి టంగ్‌ను బౌల్డ్ చేసి తన ఐదో వికెట్‌ను సాధించాడు. బుమ్రా తన కెరీర్ లో 14వ సారి ఐదు వికెట్లు సాధించాడు.

మొదటి సెషన్‌లో భారత బౌలింగ్ ఫర్వాలేదు

మొదటి సెషన్‌లో భారత్ రెండు వికెట్లు తీసింది కానీ బుమ్రా కాకుండా ఇతర బౌలర్లు రాణించారు. బ్రూక్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ, బెన్ స్టోక్స్ (పోల్డ్ బై సిరాజ్), జెమీ స్మిత్‌లతో స్థిర భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తం 28 ఓవర్లలో ఇంగ్లాండ్ 118 పరుగులు చేసింది.

ప్రసిద్ధ్ కృష్ణ ఓలీ పోప్ (106) వికెట్ తీసాడు. భారత ఫీల్డింగ్ మాత్రం మళ్లీ విఫలమైంది. పంత్ బ్రూక్ క్యాచ్ వదిలాడు, సాయి సుదర్శన్ స్మిత్‌ క్యాచ్ ను అందుకోలేకపోయాడు. చివరికి బ్రూక్, స్మిత్ భాగస్వామ్యం 50 పరుగుల మార్క్ దాటింది.

55
తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్ల స్కోర్ బోర్డులు
Image Credit : ANI

తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్ల స్కోర్ బోర్డులు

భారత్: 471 పరుగులకు ఆలౌట్

యశస్వి జైస్వాల్ 101 పరుగులు, కేఎల్ రాహుల్ 42 పరుగులు, శుభ్ మన్ గిల్ 147 పరుగులు, రిషబ్ పంత్ 134 పరుగులు చేశారు. బెన్స్ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4 వికెట్లు తీసుకున్నారు.

ఇంగ్లాండ్: 465 పరుగులు

ఓలీ పోప్ 106 పరుగులు, హ్యారీ బ్రూక్ 99 పరుగులు, బెన్ డకెట్ 62 పరుగులు సాధించారు. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసుకున్నారు.

తొలి ఇన్నింగ్స్ తర్వాత భారత్ కు 6 పరుగుల ఆధిక్యం లభించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
శుభ్‌మన్ గిల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
India vs England: ఇంగ్లాండ్ లో 2007లో చరిత్ర సృష్టించిన ద్రావిడ్ సేన.. గిల్ జట్టు రిపీట్ చేస్తుందా?
Recommended image2
Rishabh Pant: సచిన్ టెండూల్కర్ మెచ్చిన రోలీపోలీ షాట్.. రిషబ్ పంత్ ఎలా కొట్టాడో మీరు చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved