జగన్ తో కేసీఆర్ పోలిక: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jun 15, 2019, 6:26 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం

చంద్రబాబు సరే: కేసీఆర్ కూ జగన్ కూ ఎంత తేడా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఛాయలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై పడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావంతో కేసీఆర్ పై విమర్శలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ కన్నా జగన్ బెట్టర్ అనే వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోంది.

 

మన స్టార్లు రిజెక్ట్ చేసిన సినిమాలే.. కానీ సూపర్ హిట్లు

మన స్టార్ హీరోలు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడమో.. లేక కథ మీద నమ్మకం లేకపోవడం వలనో కానీ ఒక్కోసారి సూపర్ హిట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

 

మీటూ ఎఫెక్ట్.. ప్రముఖ సింగర్ విడాకుల నిర్ణయం!

కన్నడ గాయకుడు రఘు దీక్షిత్, డాన్సర్ మయూరి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. విడాకుల కోసం ఈ జంట బెంగుళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణికి తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె అధిరోహించిన సభా వేదిక కూలడంతో ప్రమాదం సంభవించింది. అయితే, ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

 

రంజీ క్రికెటర్ కు కోడెల తనయుడి టోకరా

శివరామ్‌ స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో నిరుడు ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాలని శివరామ్‌ చెప్పాడు. 

 

హీరోయిన్లకు సుమంత్ స్పెషల్ ఆఫర్!

నటుడు సుమంత్ చాలా కాలం తరువాత 'మళ్లీరావా' సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే ఆ హిట్టుని మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నాడు. 'మళ్లీరావా' తరువాత ఆయన నటించిన 'సుబ్రహ్మణ్యపురం', 'ఇదం జగత్' చిత్రాలు ఫ్లాప్ కావడంతో అతడు ఆలోచనలో పడ్డాడు.

 

జగన్ భద్రతలో నిర్లక్ష్యం.. సీఎం కాన్వాయ్ లోకి చొచ్చుకొచ్చిన వాహనాలు

భద్రతా ప్రమాణాలను ఏ మాత్రం లెక్క చేయకుండా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నట్లు ఇటీవల జరిగిన ఘటనతో చర్చనీయాశంగా మారింది. అసలు వివరాల్లోకి వెళితే.. సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా, పెనుమాకలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన జగన్ కార్యక్రమాన్ని ముగించుకొని నివాసానికి వెళ్లారు. 

 

గన్నవరం విమానాశ్రయంలో బాబుకు తనిఖీలు: ఘాటుగా స్పందించిన విజయసాయి

గన్నవరం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తనిఖీ చేయడంపై వచ్చిన వ్యాఖ్యలకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పందించారు. 
 

 

ఆ నర్స్ ని తేజ వాడుకున్నాడు.. శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పటికీ కొందరు స్తార్లను తన వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతూనే ఉంది. 

 

నా పక్క కూర్చొని నా గురించి తప్పుగా మాట్లాడారు.. హీరోయిన్ కామెంట్స్!

బాలీవుడ్ నటి తారా సుతారియా తను ఎదుర్కొన్న వింత అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఆమె నటిగా పరిచయమైన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
 

సోనాలీ లవ్ కిడ్నాప్.. మరోసారి గుర్తు చేసుకున్న షోయబ్ అక్తర్!

సోనాలి బింద్రేని కిడ్నాప్ చేయాలనీ అనుకున్నా అంటూ మరోసారి షోయబ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా సార్లు సోనాలీపై తన అభిమానాన్ని చాటుకున్న షోయబ్ రీసెంట్ గా జరిగిన క్రికెట్ చర్చలో కూడా ఆమెను గుర్తు చేసుకున్నాడు. 

 

షూటింగ్ లో ప్రమాదానికి గురైన హీరో నాగశౌర్య!

షూటింగ్ లో యువ హీరో నాగ శౌర్య ప్రమాదానికి గురయ్యాడు. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనలో నాగ శౌర్య ఎడమకాలికి గాయమయ్యింది. షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా స్టంట్ చేసిన ఈ హీరో 15 అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డాడు.

click me!