టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇప్పటికీ కొందరు స్తార్లను తన వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతూనే ఉంది. తాజాగా దర్శకుడు తేజ, నటుడు విశాల్ పై ఈ భామ మండిపడింది. ఇటీవల దర్శకుడు తేజ 'సీత' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

శ్రీరెడ్డి లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా.. ఇండస్ట్రీని ఏం చేయలేరని తేజ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో రియాక్ట్ అయింది శ్రీరెడ్డి. అతడికి హీరోయిన్ ఇలియానాతో ఎఫైర్ ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. వాటిని కంటిన్యూ చేస్తూ తాజాగా మరో పోస్ట్ వదిలింది.

'తేజ.. చాలా రోజుల క్రితం మిర్రర్ విజయ లక్ష్మి ఫ్రెండ్ ఒక నర్స్ ని ప్రేమ దోమ అని చెప్పి బాగా వాడేసి వదిలేసావ్.. గుర్తు ఉందా..?' అంటూ సంచలన కామెంట్స్ చేసింది. అలానే స్టార్ హీరో విశాల్ పై తనకున్న కోపాన్ని ప్రదర్శిస్తూ.. 'మిస్టర్ విశాల్ రెడ్డి.. నువ్ ఎంత పెద్ద ఫ్రాడ్ వో నా దగ్గర అన్ని డీటైల్స్ ఉన్నాయి... ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం వెన్నుమా' అంటూ అతడి పాపులర్ సాంగ్ ని మిక్స్ చేస్తూ ఆరోపణలు చేసింది.