నటుడు సుమంత్ చాలా కాలం తరువాత 'మళ్లీరావా' సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే ఆ హిట్టుని మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నాడు. 'మళ్లీరావా' తరువాత ఆయన నటించిన 'సుబ్రహ్మణ్యపురం', 'ఇదం జగత్' చిత్రాలు ఫ్లాప్ కావడంతో అతడు ఆలోచనలో పడ్డాడు.

కొత్త దర్శకులు చాలా మంది సుమంత్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే సుమంత్ మాత్రం తన తదుపరి చిత్రాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాస్టింగ్, హీరోయిన్ల విషయంలో ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. తన సినిమాల్లో హీరోయిన్లుగా పేరున్న వాళ్లనే తీసుకోవాలని.. అది సినిమాకు మైలేజీని తీసుకొస్తుందని భావిస్తున్నాడు.

అయితే సుమంత్ పక్కన నటించడానికి హీరోయిన్లు ఆలోచనలో పడ్డారు. అలాంటి వారికి ఓ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాడు ఈ హీరో. తనతో పాటు నటిస్తే.. అక్కినేని హీరోలలో ఒకరితో నటించే ఛాన్స్ ఇస్తానని చెబుతున్నాడట. 'మళ్లీరావా' సినిమాలో తనతో పాటు నటించిన ఆకాంక్ష సింగ్ కి ఇలానే ఆఫర్ ఇచ్చాడు. ఆ సినిమా తరువాత 'దేవదాస్'లో నాగార్జున సరసన హీరోయిన్ గా కనిపించింది ఆకాంక్ష.

సో.. అక్కినేని హీరోలతో నటించాలనుకుంటే ముందుగా సుమంత్ సినిమాలో నటిస్తే చాలన్నమాట. ప్రస్తుతం సుమంత్ తన కొత్త సినిమా కోసం సిమ్రట్ కౌర్ అనే అమ్మాయిని హీరోయిన్ గా ఎన్నుకున్నాడు. ఆమెకి కూడా ఇలాంటి ఆఫారే ఇచ్చాడట. సో.. సిమ్రట్కూడా త్వరలోనే అక్కినేని హీరో సరసన కనిపించబోతుందన్నమాట.