Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్ లో ప్రమాదానికి గురైన హీరో నాగశౌర్య!

షూటింగ్ లో యువ హీరో నాగ శౌర్య ప్రమాదానికి గురయ్యాడు. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనలో నాగ శౌర్య ఎడమకాలికి గాయమయ్యింది. షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా స్టంట్ చేసిన ఈ హీరో 15 అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డాడు. 

naga shourya injured at shooting location
Author
Hyderabad, First Published Jun 15, 2019, 7:35 AM IST

షూటింగ్ లో యువ హీరో నాగ శౌర్య ప్రమాదానికి గురయ్యాడు. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనలో నాగ శౌర్య ఎడమకాలికి గాయమయ్యింది. షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా స్టంట్ చేసిన ఈ హీరో 15 అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డాడు. 

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ అంభరివ్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తుండగా హీరో నాగ శౌర్య జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తోంది.  ఐరా ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతున్న నాగ శౌర్య నూతన చిత్రం ప్రస్తుతం విశాఖలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని చిత్ర యూనిట్ తెలిపింది.

నాగ శౌర్య నడవలేని పరిస్థితిలో ఉండడంతో సినిమా షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారు. ఛలో సినిమాతో గతంలో హిట్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసిన మరో సక్సెస్ అందుకోలేదు. నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios