కన్నడ గాయకుడు రఘు దీక్షిత్, డాన్సర్ మయూరి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. విడాకుల కోసం ఈ జంట బెంగుళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయట. దీని కారణం ఒక విధంగా మీటూ ఉద్యమమనే చెప్పాలి. అప్పటివరకు అన్యోన్యంగా ఉన్న ఈ జంటకి మీటూ సెగ తగిలింది. ఏడాది క్రితం రఘుపై మీటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

వీరి విషయంలో పెద్దలు కల్పించుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. పెద్దల సమక్షంలో సామరస్యంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరూ విడాకుల కోసం 
కోర్టులో కేసు దాఖలు చేశారు. న్యాయమూర్తి ఆరు నెలల పాటు ఈ కేసును వాయిదా వేశారు.