తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
12:00 AM (IST) Jul 28
IND vs ENG: జడేజా, వాషింగ్టన్ సెంచరీలతో మాంచెస్టర్ లో భారత్ పరువు నిలుపుకుంది. 203 పరుగుల భాగస్వామ్యంతో ఈ జోడీ ఇంగ్లండ్ విజయంపై నీళ్లు చల్లింది. డ్రా చేసుకోండి అన్న బెన్ స్టోక్స్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ఈ జోడీ వీడియో వైరల్ అవుతోంది.
11:03 PM (IST) Jul 27
India vs England: ఇంగ్లాండ్ 669 పరుగులు చేసినా భారత్ పై గెలవలేకోయింది. రవీంద్ర జడేజా- వాషింగ్టన్ సుందర్ సెంచరీలతో మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చారు.
09:33 PM (IST) Jul 27
Tilak Varma: తిలక్ వర్మ దులీప్ ట్రోఫీ 2025లో దక్షిణ జోన్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రంజీ, కౌంటీల్లో మంచి ప్రదర్శనలతో తిలక్ కు ఈ బాధ్యతలు అప్పగించారు.
08:17 PM (IST) Jul 27
TCS Layoffs: టీసీఎస్ 2026లో 2% ఉద్యోగులను తొలగించనుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. సుమారు 12,000 మందిపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా మిడ్-సీనియర్ స్థాయిలో తొలగింపులు ఉండనున్నాయి. దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
06:06 PM (IST) Jul 27
Shubman Gill: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. అలాగే, డాన్ బ్రాడ్‌మన్, సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు.
05:32 PM (IST) Jul 27
Virat Kohli and Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు 2025 ఆసియా కప్ కు దూరం అయ్యారు. వీరు ఆసియా కప్ 2025ని ఆడలేరు. టీమిండియా ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగనుంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
01:47 PM (IST) Jul 27
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకీ పెరుగుతుంది. ముఖ్యంగా రిటైల్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోంది. తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ఇందుకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలుగులోకి వచ్చాయి.
12:07 PM (IST) Jul 27
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఓవైపు అరెస్టులు చేస్తూనే మరోవైపు సోదాలు జరుపుతోంది.
11:30 AM (IST) Jul 27
తెలంగాణ రాజకీయాల్లో మరో అంశం కలకలం లేపుతోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు ఉన్న వ్యవహారం తాజాగా బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లు మారింది. ఏపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు దారి తీశాయి.
11:00 AM (IST) Jul 27
ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి, వైద్యుడిని సంప్రదించాలంటే ఆసుపత్రికి వెళ్లాలి. లైన్‌లో కూర్చొని డాక్టర్ కన్సల్టెన్సీ వచ్చే వరకు ఎదురు చూడాలి. అయితే అలాంటి అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే వైద్య సేవలు పొందే అవకాశం ఉందని మీకు తెలుసా.?
10:07 AM (IST) Jul 27
పెరుగుతోన్న సంతానలేమీ సమస్యల కారణంతో ఐవీఎఫ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఓ సెంటర్ చేసిన నిర్వాకం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..
09:08 AM (IST) Jul 27
బంగారం ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పుడే రయ్యిమని దూసుకుపోతున్న ధర ఒక్కసారిగా నేలచూపు చూస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపించింది.
08:10 AM (IST) Jul 27
ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎలాంటి డెడ్ లైన్స్ లేకుండా మంచి జీతం వచ్చే ఉద్యోగం పొందాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే అలాంటి ఉద్యోగాలు చాలా కష్టమని తెలిసిందే. అయితే అలాంటి ఓ ఉద్యోగానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
07:16 AM (IST) Jul 27
గడిచిన కొన్ని రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తడిసి ముద్దవుతున్నాయి. కాగా వాయుగుండం తీరం దాటడంతో ఆ ప్రభావం మరింత ఎక్కువ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.