తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
10:08 PM (IST) Jul 16
రూ.10,000 లోపు అత్యుత్తమ ఫీచర్లతో కూడిన 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు రియల్‌మీ గుడ్ న్యూస్ తెలిపింది. మిలిటరీ-గ్రేడ్ బిల్డ్, భారీ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్, AI కెమెరా వంటి ఫీచర్లతో వస్తున్న ఫోన్ ధరెంతో తెలుసా?
09:35 PM (IST) Jul 16
ఇంగ్లాండ్ మహిళల జట్టు, భారత్‌తో వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది.
09:35 PM (IST) Jul 16
త్వరలో జరిగే జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో కీలక నిర్ణయాాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని వస్తువుల ధరలు బాగా తగ్గుతాయట. అవేంటో తెలుసా?
08:11 PM (IST) Jul 16
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ కీలక దశకు చేరింది. ఇప్పటి వరకూ భారత్ రెండు టెస్ట్‌లు కోల్పోయిన నేపథ్యంలో, మిగిలిన మ్యాచులు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాలో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
07:11 PM (IST) Jul 16
రాష్ట్రాల మధ్య సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. తాజాగా అలాంటి ఓ సమస్య పరిష్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
06:08 PM (IST) Jul 16
గత కొన్ని రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బుధవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
05:05 PM (IST) Jul 16
Hyderabad: అడవుల్లో రాత్రుళ్లు ప్రయాణిస్తూ, జంతువులను ప్రత్యక్షంగా చూస్తుంటే కలిగే ఆ అనుభూతే వేరని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ అవకాశం ఇప్పుడు హైదరాబాదీలకు కూడా లభించింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
04:45 PM (IST) Jul 16
పబ్జీ తర్వాత ఆ మాటకొస్తే పబ్జీ రేంజ్‌లో క్లిక్ అయ్యిన మరో గేమ్ బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI). యువతలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ గేమ్‌లో తాజాగా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
04:01 PM (IST) Jul 16
టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్, టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడానికి బిసిసిఐ ఒత్తిడే కారణమా? ఇప్పుడు వన్డేల నుండి కూడా తప్పించాలని చూస్తున్నారా? వారి రిటైర్మెంట్ పై తాజాగా బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.
03:20 PM (IST) Jul 16
అమెరికా, కెనడా, యూరప్, ఆస్ట్రేలియాతో పాటు ఇతర ప్రాంతాల్లో చెలామణి అవుతున్న అతిపెద్ద చట్టవిరుద్ధ IPTV సర్వీస్ ప్రొవైడర్లలో బాస్ IPTV ఒకటి. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
02:41 PM (IST) Jul 16
తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే హీరో Vida VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. బడ్జెట్ ధరలో, అదిరిపోయే ఫిీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
01:01 PM (IST) Jul 16
నిమిష ప్రియ మరణశిక్ష వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో యెమెన్ పౌరుడు తలాల్ మరణం నుండి ఈమె మరణశిక్ష వాయిదా వరకు జరిగిన పరిణామాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
11:22 AM (IST) Jul 16
కియా నుండి మొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ MPV (మల్టీ పర్పస్ వెహికల్) కేరెన్స్ క్లావిస్ EV వచ్చేసింది. హ్యాచ్‌బ్యాక్, SUVలకు మించి ఫీచర్లు, మైలేజ్ తో EV ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
10:10 AM (IST) Jul 16
ఈ వీకెండ్ లో తెలుగు విద్యార్థులకు వరుస సెలవులు రానున్నారు. ఏ రోజు, ఎవరికి, ఎందుకు సెలవులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
09:09 AM (IST) Jul 16
Free Healthcare For Farmers: రైతుల కోసం SMSIMSRలో ఉచిత వైద్య సేవల్ని అందించే ‘సాయి సుభిక్ష హెల్త్ కార్డ్’ ప్రారంభం జరిగింది. కార్యక్రమంలో 1500 మంది రైతులు పాల్గొన్నారు.
07:26 AM (IST) Jul 16
తెలుగు రాష్ట్రాల్లో అసలైన వర్షాకాలం మొదలవుతోంది. రుతుపవనాలు ముందుగానే వచ్చినా వర్షాలు మాత్రం వెనకబడ్డాయి. ఇప్పుడు తెలంగాణ, ఏపీ ప్రజలు అసలైన వర్షాకాలాన్ని చూడనున్నారని వాతావరణ శాఖ ప్రకటనను బట్టి తెలుస్తోంది.