- Home
- Sports
- Cricket
- India vs England 4th Test: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్.. మాంచెస్టర్ టెస్ట్ కోసం మాస్టర్ ప్లాన్
India vs England 4th Test: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్.. మాంచెస్టర్ టెస్ట్ కోసం మాస్టర్ ప్లాన్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ కీలక దశకు చేరింది. ఇప్పటి వరకూ భారత్ రెండు టెస్ట్‌లు కోల్పోయిన నేపథ్యంలో, మిగిలిన మ్యాచులు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాలో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
జట్టులో చోటు కోల్పోతున్న కరుణ్ నాయర్?
ఆరంభంలో మంచి అవకాశం లభించిన కరుణ్ నాయర్, ఇప్పటి వరకూ తన స్థాయిని చూపించడంలో విఫలమయ్యాడు. ఇప్పటి వరకూ ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. 2016లో ట్రిపుల్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన అతను. ప్రస్తుతం ఫామ్‌ను నిలబెట్టుకోలేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఇది మాంచెస్టర్ టెస్ట్‌కు అతని స్థానాన్ని ప్రమాదంలో నెట్టింది.
ఈశ్వరన్‌కు అవకాశం.?
అభిమన్యు ఈశ్వరన్ పేరు ఇప్పుడు జట్టులో మార్పులకు సంబంధించి ప్రధానంగా వినిపిస్తోంది. 33 ఏళ్ల ఈ ప్లేయర్ ఇప్పటికే 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7841 పరుగులు చేశారు. 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 48.70 సగటుతో ఉన్న అతని ఫామ్, టెక్నిక్, ఆల్ రౌండ్ ప్రతిభ అతన్ని టెస్ట్ క్రికెట్‌కు పర్ఫెక్ట్ ఎంపికగా మార్చుతున్నాయి.
గౌతమ్ గంభీర్ వ్యూహంలో కీలక మార్పులు?
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ కీలక మ్యాచ్ కోసం జట్టులో మార్పులకు మొగ్గుచూపే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్‌లో బాధ్యతను బలంగా పట్టుకునే ఆటగాడి అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరుణ్‌ను పక్కన పెట్టి, ఈశ్వరన్‌కు డెబ్యూట్ ఛాన్స్ ఇవ్వవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్
ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే సిరీస్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. మిగిలిన రెండు టెస్ట్‌లు గెలవాలంటే, మాంచెస్టర్ మ్యాచ్‌లోనే మలుపు తిప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి ఆటగాడి సెలెక్షన్, ప్రదర్శన కీలకం కానుంది. దీంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠత నెలకొంది.
ఈశ్వరన్‌పైనే ఆశలు
అభిమన్యు ఈశ్వరన్ ఆటలో స్థిరత్వం, భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం జట్టుకు కొత్త శక్తిని అందించగలదని అంతా భావిస్తున్నారు. ఇప్పటివరకు టెస్ట్ అరంగేట్రం చేయని ఈ ప్లేయర్‌కు మాంచెస్టర్ మ్యాచ్ ఒక గొప్ప అవకాశంగా మారవచ్చు. ఇది టీమిండియాకు ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.