- Home
- Technology
- Tech News
- BGMI: గేమ్ లవర్స్‌కి పండగే.. BGMI 3.9 అప్‌డేట్ వచ్చేసింది. ప్రత్యేకతలు ఏంటనేగా.?
BGMI: గేమ్ లవర్స్‌కి పండగే.. BGMI 3.9 అప్‌డేట్ వచ్చేసింది. ప్రత్యేకతలు ఏంటనేగా.?
పబ్జీ తర్వాత ఆ మాటకొస్తే పబ్జీ రేంజ్‌లో క్లిక్ అయ్యిన మరో గేమ్ బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI). యువతలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ గేమ్‌లో తాజాగా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us

BGMI 3.9 అప్‌డేట్ వచ్చేసింది:
క్రాఫ్టన్ తాజాగా విడుదల చేసిన BGMI (Battle Grounds Mobile India) 3.9 అప్‌డేట్ గేమర్లలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌లో గేమ్‌ప్లే మెరుగుదలతో పాటు, ట్రాన్స్‌ఫార్మర్స్ స్పెషల్ కలాబరేషన్, కొత్త ఆయుధాలు, వాహనాలు, ర్యాంక్ మోడ్‌లతో శక్తివంతమైన ఫీచర్లను జోడించారు. ఈ వెర్షన్ మొబైల్ గేమింగ్‌కి గట్టి బూస్ట్ ఇవ్వనుంది.
ట్రాన్స్‌ఫార్మర్స్ కంటెంట్ అదిరింది
ఈసారి అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ ట్రాన్స్‌ఫార్మర్స్ క్యారెక్టర్లతో కూడిన ప్రత్యేక కలాబరేషన్. గేమ్‌లో Optimus Prime, Megatron లాంటి పాపులర్ క్యారెక్టర్లు కనిపిస్తాయి Erangel, Livik, Sanhok మ్యాప్స్‌లో వీటిని యాక్సెస్ చేయొచ్చు.
Neon Outpost Zone అనే కొత్త జోన్‌లో Arena, Black Market, Energy Plant, Astro Den (melee-only) అనే నాలుగు ఇంటరాక్టివ్ లొకేషన్లు ఉన్నాయి. గేమర్స్ Energon కలెక్ట్ చేస్తే ట్రాన్స్‌ఫార్మర్ క్యారెక్టర్లు అన్‌లాక్ అవుతారు. రెండు ట్రాన్స్‌ఫార్మర్స్ కలిసినప్పుడు Duel Zone ప్రారంభమవుతుంది ఇది ప్రత్యేక గేమింగ్ అనుభూతిని ఇస్తుంది.
కొత్త గేమ్‌ప్లే, ఆయుధాలు, వాహనాలు
ఈ అప్‌డేట్‌లో పలు కొత్త ఎలిమెంట్లు వచ్చాయి, అవి ఆటను మరింత డైనమిక్‌గా చేస్తాయి.
Anti-Gravity Spires: గాలిలో ఎగిరే టెలిపోర్ట్ లాంటి ఫీచర్
కొత్త వాహనాలు, వస్తువులు: కాస్మిక్ హావర్‌బోర్డ్, స్టార్రీ ఎగ్జాస్ట్, బాంక్ హమర్
కొత్త ఆయుధం ASM Abakan: 5.56mm అమ్యునిషన్‌తో పని చేసే ఈ గన్ ఫుల్ ఆలో, బ్రస్ట్, సింగిల్ షాట్ మోడల్స్‌లో తీసుకొచ్చారు. మెడ్ కిట్ తర్వాత స్ప్రింట్ స్పీడ్ పెరగడం, బైక్ డ్రిఫ్ట్ స్కిడ్ మార్క్స్, మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్లేన్‌లో ఇంటరాక్షన్ లాంటి స్మార్ట్ ట్వీక్స్ ఉన్నాయి
సోషల్ ఫీచర్లు, ర్యాంక్ మోడ్
గేమింగ్‌కు వినోదాన్ని జోడించేలా కొత్త సోషల్ ఫీచర్లు వచ్చాయి. 3D Social Hub లెవెల్ 9 పై ఉన్నవారికి అందుబాటులో ఉంటుంది. ఇందులో Central Plaza, Beach, Dance Stage వంటివి ఉంటాయి. హోల్డ్ హ్యాండ్స్, ప్రిన్సెస్ క్యార్సీ, పిగ్గీ బ్యాక్ వంటి ఎమోట్స్ ఇచ్చారు.
మినీ గేమ్స్: ఫుట్‌బాల్, ఫైర్‌వర్క్స్
ర్యాంక్ అరీనా మోడ్:
ప్రారంభం: జూలై 24
ముగింపు: సెప్టెంబర్ 2
మ్యాప్స్: Warehouse, Hangar
ర్యాంకులు: Bronze to Ace
టాప్ 1000 ప్లేయర్స్‌కి ప్రత్యేక టైటిల్ లభిస్తుంది
హోమ్ అప్‌డేట్ & గిఫ్ట్ ఫీచర్లు
Arcadia Haven థీమ్: హోమ్ స్క్రీన్ లో నూతనమైన లుక్
Parking Lot: 8 వాహనాలు స్టోర్ చేసుకునే అవకాశం
Blueprint Plan: Installment ద్వారా ఖరీదైన ఐటెమ్‌లు కొనగలగడం
Popularity Battle: జూలై 23 నుంచి ఆగస్టు 22 వరకు నిర్వహిస్తారు.
పాపులారిటీ క్రిస్టల్స్‌ను సేకరించి, కస్టమ్ కార్డులు, బ్యాక్‌గ్రౌండ్స్ అన్‌లాక్ చేసుకోవచ్చు.
BGMI 3.9 అప్‌డేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
Google Play Store లేదా Apple App Store లోకి వెళ్లి BGMIని అప్డేట్ చేయండి. ఫోన్‌లో తగిన స్టోరేజ్, బ్యాటరీ లెవెల్ ఉండాలి. అలాగే అప్‌డేట్ చేసిన తర్వాత గేమ్‌ని రీస్టార్ట్ చేయడం మరిచిపోవద్దు.