- Home
- Automobile
- Kia Carens Clavis EV: 40 నిమిషాల ఛార్జింగ్ తో 490 కి.మీ మైలేజ్.. మార్కెట్లోకి కియా EV 7 సీటర్, ధరెంతో తెలుసా?
Kia Carens Clavis EV: 40 నిమిషాల ఛార్జింగ్ తో 490 కి.మీ మైలేజ్.. మార్కెట్లోకి కియా EV 7 సీటర్, ధరెంతో తెలుసా?
కియా నుండి మొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ MPV (మల్టీ పర్పస్ వెహికల్) కరెన్స్ క్లావిస్ EV వచ్చేసింది. హ్యాచ్‌బ్యాక్, SUVలకు మించి ఫీచర్లు, మైలేజ్ తో EV ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Kia Cravens Clavis EV లాంచ్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ MPV ని లాంచ్ చేసింది. కరెన్స్ క్లావిస్(Cravens Clavis) పేరుతో సరికొత్త EV కారును పరిచయం చేసింది ఈ సౌత్ కొరియా కార్ల కంపనీ. రూ.17.99 లక్షల ప్రారంభ ధరతో దీన్ని ఆవిష్కరించింది.
ఈ 7 సీటర్ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 490 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కియా ప్రకటించింది. అలాగు ఫాస్ట్ ఛార్జింగ్, లెవెల్ 2 ADAS ఫీచర్లను కూడా కలిగివుంది. ఇది ఫ్రీగా ప్రయాణం, మంచి పనితీరు కోరుకునే కుటుంబాలను సరిగ్గా సరిపోతుంది. భారతదేశంలో తయారైన ఈ EV కియా ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది.
4 వేరియంట్లలో అందుబాటులోకి కియా కరెన్స్ క్లావిస్ EV
రెండు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌ల ఆధారంగా కరెన్స్ క్లావిస్ EV నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. HTK Plus 42 kWh వేరియంట్ ధర రూ.17.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది, HTX 42 kWh వేరియంట్ ధర రూ.20.49 లక్షలు, అధిక సామర్థ్యం గల HTX 51.4 kWh వేరియంట్ ధర రూ.22.49 లక్షలు, HTX Plus 51.4 kWh వేరియంట్ ధర రూ.24.49 లక్షలుగా నిర్ణయించారు. 7 సీటింగ్ సామర్థ్యంతో వచ్చిన ఈ వాహనం పెద్ద కుటుంబాలకు అనువైనది.
భారత్ లోనే Kia Carens Clavis EV తయారీ
EV6, EV9 మోడళ్లలా కాకుండా దిగుమతి చేసుకోవడం కాదు కరెన్స్ క్లావిస్ EV భారతదేశంలోనే తయారైన తొలి కియా ఎలక్ట్రిక్ వాహనం. 51.4 kWh వేరియంట్‌కు 490 కి.మీ, 42 kWh మోడల్‌కు 404 కి.మీ అద్భుతమైన రేంజ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. 100-kW DC ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 39 నిమిషాల్లో 10% నుండి 80% వరకు బ్యాటరీ ఛార్జ్ చేయవచ్చని… ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం ఇందులో ఒక ముఖ్య ఫీచర్ గా పేర్కొంటోంది.
MPV ( మల్టి పర్పస్ వెహికిల్) కి 99 kW, 126 kW అనుకూలంగా ఉంంటాయని.. ఈ రెండూ 255 Nm టార్క్‌ను అందిస్తాయని కియా చెబుతోంది. అంటే ఈ వాహనాలు పూర్తిగా లోడ్ అయినప్పటికీ కేవలం 8.4 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలవు.
Kia Carens Clavis EV బ్యాటరీ
కరెన్స్ క్లావిస్ EV IP67-రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది… ఇది డస్ట్, వాటర్ ప్రూఫ్. వర్షాకాలంలో ఈ బ్యాటరీ మన్నికను నిర్ధారించడానికి 420-మిమీ వాటర్-వేడింగ్ పరీక్షలు నిర్వహించినట్లు కియా వెల్లడించింది.
ఈ కరెన్స్ క్లావిస్ i-పెడల్ డ్రైవింగ్ మోడ్ కలిగివున్నాయి… ఇది సింగిల్-పెడల్ డ్రైవింగ్‌ను అనుమతించడానికి రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను పెంచుతుంది. యాక్సిలరేటర్ విడుదలైనప్పుడు కారు నెమ్మదిస్తుంది, పూర్తిగా ఆగుతుంది.
Kia Carens Clavis EV భద్రతా ఫీచర్లు
ఈ కరెన్స్ క్లావిస్ భద్రతతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతికి ఇస్తాయని కియా చెబుతోంది. MPVలో లేన్-కీపింగ్, అత్యవసర బ్రేకింగ్, బ్లైండ్-స్పాట్ హెచ్చరికలతో లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఉంది. అదనపు భద్రతా లక్షణాలలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, వెనుక సీట్ ప్రయాణీకుల హెచ్చరిక వ్యవస్థ ఉన్నాయి. గత మేలో లాంచ్ చేసిన కరెన్స్ క్లావిస్ ICE వెర్షన్ ను పోలిన ఫీచర్లే ఈ కరెన్స్ క్లావిస్ EV కూడా కలిగివుంది.