ఎయిర్ ఇండియా ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ డేటా ఆధారంగా విచారణ జరుగుతోంది. ఇక ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి గోయల్ తో సమావేశం కానున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:54 PM (IST) Jun 15
Jobs: తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ద్వారా 10,080 ఉద్యోగ అవకాశాలు విడుదల అయ్యాయి. అర్హత కలిగిన అందరూ వెంటనే నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
11:52 PM (IST) Jun 15
instant loan: ఎప్పుడు ఎమర్జెన్సీ ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చేందుకు అనేక డిజిటల్ లోన్ యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.50,000 వరకు తక్షణ రుణం పొందొచ్చు. దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం.
11:11 PM (IST) Jun 15
SBI: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఏడాదికి రూ.6 కోట్లు, అభిషేక్ బచ్చన్‌కు నెలకు రూ.18.9 లక్షలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చెల్లిస్తోంది. ఎందుకు వీళ్లకు ఇంత భారీ మొత్తాన్ని ఎస్‌బీఐ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
08:27 PM (IST) Jun 15
From 25000 salary to 5 crore wealth: రూ.25,000 జీతంతో ప్రయాణం మొదలుపెట్టి 11 ఏళ్లలో రూ.5 కోట్ల సంపద నిర్మించిన ఒక ఉద్యోగి కథ ప్రతి మధ్యతరగతి ఉద్యోగికి ఆదర్శంగా.. ఆచరించాల్సిన అంశంగా నిలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:37 PM (IST) Jun 15
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆటోమొబైల్ కంపెనీల్లో టాప్ కంపెనీ అయిన టాటా కూడా ఎక్కువ EVలను విడుదల చేస్తోంది. ఇదే కంపెనీ నుంచి వచ్చిన హారియర్, కర్వ్ లలో ఏది బెస్ట్ కారో ఇప్పుడు చూద్దాం.
07:30 PM (IST) Jun 15
pune bridge collapse: మహారాష్ట్ర పుణే మావల్‌లోని కుందమాల వద్ద వంతెన కూలిపోవడంతో 125 పర్యాటకులు నీటిలో పడిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
06:56 PM (IST) Jun 15
Lap Top Screen car: కార్ల కంపెనీలు కొత్త ఫీచర్స్ తో లేటెస్ట్ మోడల్స్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ప్రస్తుతం ట్రెండీ ఫీచర్. రూ.10 లక్షల లోపు బెస్ట్ స్క్రీన్ ఉన్న టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
06:47 PM (IST) Jun 15
Hillang Yajik: దక్షిణాసియా బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో 1 స్వర్ణం, 1 రజతం గెలిచి హిల్లాంగ్ యాజిక్ చరిత్ర సృష్టించారు. అరుణాచల్ మహిళ తొలి మహిళగా రికార్డులకు ఎక్కారు.
06:21 PM (IST) Jun 15
CM Chandrababu meets Piyush Goyal: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ సుంకాలు, ఆక్వా ఎగుమతులపై కీలక నిర్ణయాల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
05:38 PM (IST) Jun 15
Best Network: ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియా ఈ మూడు ప్రైవేట్ టెలికాం నెట్వర్క్ లలో ఏది బెస్టో మీకు తెలుసా? ఎంటర్‌టైన్మెంట్ ఆఫర్స్, డేటా రీఛార్జ్స్, 5జీ నెట్వర్క్ ఇలా ఏ కేటగిరీలో ఏది బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
05:28 PM (IST) Jun 15
ICC changes boundary catch rule: బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లకు ఐసీసీ కొత్త రూల్ప్ తీసుకువచ్చింది. క్యాచ్ లను పరిగణిలోకి తీసుకునే విషయాల్లో కీలక మార్పులు చేసింది.
05:02 PM (IST) Jun 15
kedarnath helicopter crashes: ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ నుంచి గుప్తకాశికి వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు.
04:02 PM (IST) Jun 15
Kusha Air Defence System: డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న కుషా ప్రాజెక్ట్ ద్వారా మూడు వేరియంట్లతో శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థలను భారత సైన్యానికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
03:36 PM (IST) Jun 15
Tragedy in Basara: బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్‌లోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యువకులు గోదావరిలో స్నానం చేస్తుండగా మునిగి మృతి చెందారు.
12:48 PM (IST) Jun 15
EV Scooters for College Students: మీ పిల్లలు కాలేజీకి వెళ్లడానికి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? బైక్ ల కంటే ఇవి చాలా బెస్ట్. ఒక్క ఛార్జ్ తో ఎక్కువ దూరం ప్రయాణించే బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
12:30 PM (IST) Jun 15
ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల భారీ నష్టం జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ధృవీకరించింది. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫాయేల్ గ్రోస్సీ ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి నివేదించారు.
11:49 AM (IST) Jun 15
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఒక్క రోజులో దర్శనం చేసుకుని తిరిగి రావడం కష్టం. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
10:54 AM (IST) Jun 15
ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఈ సమయంలో ఆయన మూడు దేశాలను సందర్శించనున్నారు.
10:24 AM (IST) Jun 15
ప్రస్తుతం చాలా మంది పొదుపు మాంత్రాన్ని పాటిస్తున్నారు. అందులోనూ ఎలాంటి రిస్క్ లేకుండా, మంచి రిటర్న్స్ వచ్చే వాటిపై మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఒక బెస్ట్ సేవింగ్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
10:02 AM (IST) Jun 15
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం షాక్ నుంచి ఇంకా దేశంలో కోలుకోక ముందే మరో ప్రమాదం జరిగింది. ఉత్తరఖాండ్‌లో ఓ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
09:26 AM (IST) Jun 15
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్నే కాకుండా, ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది. ఏకంగా 240కి పైగా మంది మరణించడం విమానయాన రంగంలో జరిగిన అత్యంత తీవ్ర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.
07:40 AM (IST) Jun 15
తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
07:23 AM (IST) Jun 15
ఇరార్, ఇజ్రాయిల్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇరాన్‌లోని అణ్వాయుధ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించింది. కాగా ఈ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.