Best Network: ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్-ఐడియా ఈ మూడు ప్రైవేట్ టెలికాం నెట్వర్క్ లలో ఏది బెస్టో మీకు తెలుసా? ఎంటర్‌టైన్మెంట్ ఆఫర్స్, డేటా రీఛార్జ్స్, 5జీ నెట్వర్క్ ఇలా ఏ కేటగిరీలో ఏది బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రైవేటు టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్, జియో, ఐడియా-వొడాఫోన్ పోటాపోటీగా ఆఫర్లు ఇస్తున్నాయి. ఒకటి డేటా ప్లాన్స్ బాగా ఇస్తుంటే, మరొకటి 5జీ నెట్వర్క్ స్పీడ్ గా అందిస్తోంది. ఈ మూడు నెట్వర్క్ లలో ఏది ఎందులో బెస్ట్ గా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఆఫర్‌లను బడ్జెట్-ఫ్రెండ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లతో మెరుగుపరుచుకుంది. ఇది కేవలం రూ.279 నుండి ప్రారంభమయ్యే ఈ ప్లాన్‌లలో Netflix, SonyLIV, Zee5, Airtel Xstream Play వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లను ఉచితంగా అందిస్తోంది.
ఎయిర్‌టెల్ టెలికాం కంపెనీ 7 రోజుల వ్యాలిడిటీతో కేవలం రూ.22లకే 1GB డేటా అందిస్తోంది. అదే రూ.77లకు 5GB డేటా ఇస్తోంది. ఈ రెండు ప్లాన్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటాను అందిస్తూ వినియోగదారులకు ఫేవరేట్ రీఛార్జ్ ప్లాన్స్ గా మారాయి.
లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసం ఎయిర్‌టెల్ 90 రోజులకు రూ.929 ప్లాన్ అందిస్తోంది. ఇది రోజుకు 1.5GBను అందిస్తుంది. రూ.2,249 వార్షిక ప్లాన్‌లో పూర్తిగా కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇది ఏడాదికి 30 GB ఇస్తోంది.
జియో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లు
రిలయన్స్ జియో అధిక విలువ కలిగిన డేటా ప్లాన్స్, అన్ లిమిటెడ్ 5G యాక్సెస్‌తో మార్కెట్ లో ఆధిపత్యం చెలాయిస్తోంది. రూ.100, రూ.200 ప్రీపెయిడ్ వోచర్‌లు వరుసగా 5GB, 15GB డేటాతో వస్తున్నాయి. ఇవి 90 రోజుల పాటు JioHotstarను కూడా అందిస్తున్నాయి. రోజువారీ వినియోగదారుల కోసం రూ.349 ప్లాన్ ద్వారా 5G నెట్వర్క్ ను 28 రోజుల వ్యాలిడిటీతో ఇస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2GB లభిస్తుంది.
లాంగ్ టర్మ్ ప్లాన్ లుగా రూ.749(72 రోజులు) రూ.3,599(365 రోజులు) ప్లాన్‌లను అందిస్తోంది. ఇవి రెండూ రోజువారీ డేటా, OTT ప్రయోజనాలను కూడా ఇస్తున్నాయి. జియో రూ.601 వార్షిక ప్లాన్ అయితే రోజూ అన్ లిమిటెడ్ 5G ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ఇప్పుడు బెస్ట్ డేటా ప్లాన్ గా ఉంది.
Vi రీఛార్జ్ ప్లాన్‌లు
వోడాఫోన్ ఐడియా(Vi) రూ.99 రీఛార్జ్ ప్లాన్ ను 15 రోజుల వ్యాలిడిటీతో 200 MB డేటా అందిస్తోంది. రూ.345 ప్లాన్ తో 25 GB డేటా ఇస్తోంది. అదే సమయంలో రూ.579 ప్యాక్ 1.5GB/రోజుతో పాటు “Binge All Night”, వారాంతపు రోల్‌ఓవర్‌ను అందిస్తుంది. వార్షిక వినియోగదారుల కోసం రూ.1,999(మొత్తం 24GB డేటాతో), రూ.3,499 (ఇది OTT యాక్సెస్, SMS ప్రయోజనాలు వంటి అదనపు ప్రయోజనాలతో రోజుకు 1.5GB అందిస్తుంది) ప్లాన్స్ అందిస్తోంది.
ఏ డేటా ప్యాక్ బెస్ట్?
బడ్జెట్ విభాగంలో ఎయిర్‌టెల్ ఒకే రోజు డేటా ప్లాన్ రూ.22 ప్యాక్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. జియోలో అయితే రూ.100 ప్యాక్ JioHotstar ద్వారా వినోదాన్ని అందిస్తుంది. స్టార్టింగ్ డేటా ఆఫర్‌లలో Vi కొంత వెనుకబడి ఉంది. ఇది రూ.99 ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ డేటా ప్రయోజనాలను అందిస్తోంది. వీటిల్లో ఏది మీ అవసరాలకు తగ్గట్టుగా ఉంటుందో దాన్ని తీసుకోవడం మంచిది.
OTT ప్లాన్‌లలో ఏది బెస్ట్?
OTT విభాగంలో ఎయిర్ టెల్ ముందంజలో ఉంది. ఇది అందించే ప్యాక్‌లలో 25+ యాప్‌లు ఉన్నాయి. అయితే Vi రూ.994 నుండి ప్రారంభమయ్యే హై-ఎండ్ ప్లాన్‌లలో Netflix, Disney+ Hotstarను అందిస్తుంది. జియో, JioTV, JioCinemaతో పాటు Hotstarను కూడా కలిగి ఉంది. వినోదాన్ని కోరుకొనే వారు ఎయిర్‌టెల్, Viని ఎంచుకోవడం బెస్ట్.
5G కవరేజ్ వేగంలో ఏది బెస్ట్?
5Gలో జియో ముందంజలో ఉంది. అనేక ప్లాన్‌లు రూ.1,000 కంటే తక్కువకే అపరిమిత వినియోగాన్ని అందిస్తున్నాయి. ఎయిర్ టెల్ పూర్తి 5G మద్దతును అందిస్తుంది. Vi ఎంచుకున్న ప్రీమియం ప్లాన్‌లలో మాత్రమే 5Gని అందిస్తుంది.