ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆటోమొబైల్ కంపెనీల్లో టాప్ కంపెనీ అయిన టాటా కూడా ఎక్కువ EVలను విడుదల చేస్తోంది. ఇదే కంపెనీ నుంచి వచ్చిన హారియర్, కర్వ్ లలో ఏది బెస్ట్ కారో ఇప్పుడు చూద్దాం.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇటీవల టాటా మోటార్స్ దాని ప్రీమియం ఎలక్ట్రిక్ SUV, హారియర్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో చాలా అట్రాక్టివ్ గా ఉంది. అయితే టాటా నుంచే ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చి కారు ప్రియులను ఆకట్టుకుంటోన్న కర్వ్ ఎలక్ట్రిక్ కారు కూడా దాదాపు ఇలాంటి ఫీచర్లనే కలిగిఉంది. అయితే ధరల విషయంలో చాలా తేడా ఉంది. మరి హారియర్, కర్వ్ వెహికల్స్ లో ఏది బెస్ట్ కారో ఇప్పుడు చూద్దాం.
హారియర్, కర్వ్ వెహికల్స్ రెండు EVలు రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తాయి. హారియర్ EV ధర రూ.22.93 లక్షల (ఆన్-రోడ్) నుండి ప్రారంభమవుతుంది. కర్వ్ EV ధర రూ.18.49 లక్షల (ఆన్-రోడ్) నుండి ప్రారంభమవుతుంది. హారియర్, కర్వ్ ల మధ్య పోలికలు, తేడాలు పరిశీలిద్దాం.
హారియర్ EV vs కర్వ్ EV: రేంజ్
హారియర్ EV 69 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఇది 79 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ 627 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. కర్వ్ EV అయితే 45 kWh, 55 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. 45 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే 502 కి.మీ., 55 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే 585 కి.మీ. వరకు వెళ్తుంది.
హారియర్ EV vs కర్వ్ EV: డ్రైవ్‌ట్రెయిన్
టాటా మోటార్స్ హారియర్ EVని రియర్ వీల్ డ్రైవ్, AWD డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్‌తో అందిస్తోంది. కర్వ్ EVకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ మాత్రమే ఉంది.
హారియర్ EV vs కర్వ్ EV: ఫీచర్లు
హారియర్, కర్వ్ రెండూ అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. హారియర్ EV ట్రాన్స్‌పరెంట్ మోడ్‌తో 540 డిగ్రీ పార్కింగ్ కెమెరాను కలిగి ఉంది. ఆరు డ్రైవింగ్ మోడ్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 14.3 అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణ.
కర్వ్ EV 360 డిగ్రీ పార్కింగ్ కెమెరాను కలిగి ఉంది. డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. హారియర్ EV, కర్వ్ EV రెండూ వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-వెహికల్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.
హారియర్ EV విలువైనదేనా?
కర్వ్ EV కంటే హారియర్ EV రూ.5 లక్షలు ధర ఎక్కువ. కాస్త ధర ఎక్కువైనా హారియర్ AWD డ్రైవ్‌ట్రెయిన్ కొన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంది. అయితే కూపే SUV లుక్‌ను ఇష్టపడే వారికి కర్వ్ EV బెస్ట్ సెలెక్షన్.
