ICC changes boundary catch rule: బౌండరీ లైన్ క్యాచ్‌పై కొత్త రూల్స్
ICC changes boundary catch rule: బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లకు ఐసీసీ కొత్త రూల్ప్ తీసుకువచ్చింది. క్యాచ్ లను పరిగణిలోకి తీసుకునే విషయాల్లో కీలక మార్పులు చేసింది.

బౌండరీ క్యాచ్‌పై ఐసీసీ కీలక మార్పులు
ICC changes boundary catch rule: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), మేర్‌లిబోన్ క్రికెట్ క్లబ్ (MCC) క్రికెట్‌లో బౌండరీ క్యాచ్ నిబంధనలో కీలక మార్పులను ప్రకటించాయి. ఈ కొత్త నియమం 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ ప్రారంభం కానున్న జూన్ 17, 2025 నుంచి అమలులోకి రానుంది. మేర్‌లిబోన్ క్రికెట్ క్లబ్‌లో (MCC) మాత్రం ఈ మార్పు అధికారికంగా అక్టోబర్ 2026 నుంచి అమలవుతుంది.
కొత్త బౌండరీ క్యాచ్ నిబంధనలు ఏంటి?
ఐసీసీ ప్రకటన ప్రకారం, ఇకపై బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్ ఒకేసారి మాత్రమే బాల్‌ను ఎగరేసి క్యాచ్ పడితేనే అవుట్ గా పరిగణిస్తారు. గతంలో అతను బౌండరీ రోప్ బయట ఉన్నప్పటికీ, గాల్లో ఉన్న స్థితిలో ఉండడం ద్వారా బాల్‌ను ఎక్కువ సార్లు ఎగురవేసి అందుకున్న అవుట్ గా ప్రకటించేవారు. అయితే, ఇప్పుడు ఈ అవకాశం ఒక్కసారికే పరిమితం చేశారు.
బౌండరీ లైన్ దాటిన క్యాచ్
కొత్త నియమం ప్రకారం, ఒక ఫీల్డర్ గాలిలో ఉన్న బంతిని బౌండరీ రోప్ వెలుపల నుంచి ఎగురవేసి మళ్లీ రోప్ లోపలికి పంపించడమూ, లేదా మరొక ఫీల్డర్ దానిని క్యాచ్ చేయడమూ చేస్తే అది సరైన క్యాచ్‌గా పరిగణిస్తారు. కాబట్టి మొదటి ఫీల్డర్ కూడా బౌండరీలో ఉండాలి. అలాగే బాల్‌ను బౌండరీ వెలుపల గాల్లో రెండుసార్లు ఎగురవేయడం జరిగితే, ఆ క్యాచ్ చెల్లదు.
2023 నెసర్ క్యాచ్ వివాదం వల్ల మార్పులు
ఈ నియమ మార్పుకు పునాది పడినది 2023లో బిగ్ బాష్ లీగ్‌లో జరిగిన వివాదాస్పద సంఘటన. ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైకెల్ నెసర్ బౌండరీ వద్ద ఒక అద్భుతమైన, వివాదాస్పదమైన క్యాచ్ పట్టాడు. అప్పటి నియమాల ప్రకారం అది చెల్లుబాటు కాగా, ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
బ్యాట్స్‌మెన్‌కు ఊరట
ఈ మార్పు ప్రధానంగా బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా ఉండగా, ఫీల్డింగ్ చేసేవారికి నియంత్రణగా మారింది. టెక్నికల్‌గా సవాళ్లు ఎదుర్కొంటున్న ఫీల్డింగ్ యూనిట్లకు ఇది కొత్త మార్గదర్శకంగా నిలుస్తుంది.
ఈ నియమ మార్పులు అన్ని అంతర్జాతీయ మ్యాచులపైనా వర్తిస్తాయి. అంటే టెస్ట్, వన్డే, టి20 ఫార్మాట్లలో కూడా అమల్లో ఉంటాయి. MCC నిబంధనల ప్రకారం అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇవి అమలు చేయాల్సి ఉంటుంది.