తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:41 PM (IST) Apr 18
GI-PKL 2025: కబడ్డీ క్రీడను అంతర్జాతీయంగా ప్రోత్సహించడానికి జీఐపీకేఎల్ నిర్వహిస్తున్నారు. 2025లో మొదటి ఎడిషన్ గురుగ్రామ్ లో జరుగుతోంది. గ్లోబల్ ఇండియన్ ప్రవాసీ కబడ్డీ లీగ్ (GI-PKL) 2025 లో పాల్గొంటున్న పురుషుల జట్ల ఆటగాళ్ల పూర్తి జాబితా వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి11:12 PM (IST) Apr 18
18 Years of IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. 2008లో ప్రారంభమై మెగా క్రికెట్ లీగ్ గా మారింది. టీ20 క్రికెట్, క్రీడా వినోదాన్ని విప్లవాత్మకంగా మార్చింది. క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఈ లీగ్ లో ఐకానిక్ క్షణాలు చాలా ఉన్నాయి.
10:51 PM (IST) Apr 18
Health Tips: మన వంటగదిలోనే మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధాలు ఎన్నో ఉన్నాయని మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి ఇప్పుడు.. ప్రకృతిని మనకు ఏది లభించినా.. అది మనకోసం సృషించబడిందే. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. తేనే కంటే.. గసగసాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
09:49 PM (IST) Apr 18
Fruits and Vegetables: పండ్లు, కూరగాయలు వాటి తాజా దనాన్ని, పోషక విలువలను కాపాడుకోవడానికి వాటిని సరిగ్గా నిల్వ చేయడం చాలా అవసరం. అయితే, చాలా మంది వాటిని కలగలిపి ఒకేచోట నిల్వ చేస్తుంటారు. ఇలా చేస్తనే తప్పులో మీరు కాలేసినట్లే.. ఒకేచోట రెండింటిని కలిపి నిల్వ చేయడం వల్ల కొన్ని ఉత్పత్తులు త్వరగా పాడైపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా...
09:01 PM (IST) Apr 18
Most Gold used Countries: భారత్ లో బంగారం వినియోగంలో గత మూడేళ్ల గణాంకాలు గమనిస్తే రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 2024లో మొత్తం బంగారం డిమాండ్ 802.8 టన్నులుగా ఉంది. ఇది 2023 తో పోలిస్తే 5 శాతం పెరుగుదలను నమోదుచేసింది. అయతే, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉపయోగిస్తున్న టాప్-10 దేశాలు ఏవి? ఇందులో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:50 PM (IST) Apr 18
Fastest Century In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఇదే రోజున అంటే 2008 ఏప్రిల్ 18 క్రికెట్ ప్రపంచంలో కొత్తగా దూసుకువచ్చిన ఐపీఎల్ ఇప్పుడు రిచ్ క్రికెట్ లీగ్ గా మారింది. క్రికెట్ లవర్స్ కు మస్తు మజాను అందిస్తోంది. ఐపీఎల్ లో ఇప్పటివరకు అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేసిన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అయితే, ఐపీఎల్ హిస్టరీలో ధనాధన్ ఇన్నింగ్స్ తో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
07:10 PM (IST) Apr 18
ఆలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముగ్గురు సిస్టర్స్ కలిసి నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించి భారీగా లాభాలు ఆర్జించారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. అయితే ఓ వివాదంతో ఈ ముగ్గురు విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. దెబ్బకు వ్యాపారాన్ని ముసుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఈ సిస్టర్స్ ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆలేఖ్య సిస్టర్స్ ఈసారి ఏం చేయనున్నారంటే..
07:08 PM (IST) Apr 18
Rohit sharma: ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. అంతకుముందు టీ-20 వరల్డ్ కప్పు కైవసం చేసుకుంది. జట్టుకు రోహిత్ కెప్టెన్ అయినప్పటి నుంచి టీమిండియాకి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. డాషింగ్ ఒపెనర్‌గా జట్టును ముందుకు నడపడంతో రోహిత్ దిట్ట.
06:47 PM (IST) Apr 18
Benefits of the new tax regime: ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం జీతం తీసుకునే వారికి పెద్ద ఊరటనిస్తూ, కొత్త టాక్స్ రిజిమ్ కింద 12 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపును ప్రకటించింది. బడ్జెట్ నిబంధనలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చాయి. కొత్త టాక్స్ నిబంధనల ప్రకారం మీరు ఎంత వరకు డబ్బును ఆదా చేసుకోగలరో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:22 PM (IST) Apr 18
రాహుల్ గాంధీ విజ్ఞప్తి మేరకు కర్ణాటకలో రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. విద్యారంగంలో కుల వివక్షతను నిర్మూలించడం, అట్టడుగు వర్గాల విద్యార్థులకు సామాజిక న్యాయం అందించడం ఈ చట్టం లక్ష్యం.
పూర్తి కథనం చదవండి06:04 PM (IST) Apr 18
ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభంలో ప్రపంచ బెట్టింగ్ కంపెనీ 1xBet ఏ జట్టుకి ఎక్కువ మద్దతు లభిస్తుందో తెలుసుకోవడానికి అభిమానుల పోల్ నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి05:30 PM (IST) Apr 18
KL Rahul daughter Name: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్-అతియా శెట్టిలు ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. మార్చి 24న ఈ స్టార్ కపుల్ కు ఆడబిడ్డ పుట్టింది. తన బర్త్ డే రోజున మరో గుడ్ న్యూస్ చెబుతూ కూతురు పేరును రివీల్ చేశారు. ఆ పేరేంటి? దానికి అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:29 PM (IST) Apr 18
మీరు ఎక్కడికైనా వెళుతుంటే సడన్ గా వాహనంలో పెట్రోల్ అయిపోయినా లేదా మరేదైనా సహాయం అవసరమైనా కంగారుపడకండి. మీ సహాయం కోసమే NHAI ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:43 PM (IST) Apr 18
IPL Match Power Facts: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి బంతికీ థ్రిల్, ప్రతి షాట్‌కీ హోరు, ప్రతి స్టేడియంలో జిగేల్ మనే లైట్లు.. ఇలా చాలానే ఉన్నాయి. అయితే, ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఎంత కరెంటు ఖర్చవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయాలు ఇప్పుడు మిమ్మల్ని తప్పకుండా షాక్ చేస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
04:40 PM (IST) Apr 18
JEE మెయిన్ 2025 సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ విడుదలయ్యింది.ఫైనల్ ఆన్సర్ కీ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంది...డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది.
పూర్తి కథనం చదవండి
04:32 PM (IST) Apr 18
ఈ ప్రముఖ నటీమణులు హార్డ్-హిట్టింగ్ డ్రామాల నుండి హై-ఆక్టేన్ యాక్షన్ వరకు అన్ని శైలుల్లో చిత్రాలకు నాయకత్వం వహిస్తున్నారు, అంతేకాకుండా మహిళా నేతృత్వంలోని కథనాలు బాక్సాఫీస్‌ను ఆకర్షించగలవని నిరూపిస్తున్నారు
పూర్తి కథనం చదవండి04:23 PM (IST) Apr 18
మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. ఇందులో న్యూమరాలజీ ఒకటి. పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మన ఆలోచనలు ఎలా ఉంటాయి. లాంటి అంశాలను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతుంటారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు అంటుంటారు. ఆ తేదీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
03:50 PM (IST) Apr 18
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటనకు సర్వం సిద్దమయ్యింది. రేపోమాపో రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ఫలితాలను ప్రకటించనుంది. మీ పిల్లలు కూడా ఇంటర్ పరీక్షలు రాసారా? అయితే ఫలితాల విడుదల తర్వాత ఇలా చెక్ చేయండి. స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ అందిస్తున్నాం.
పూర్తి కథనం చదవండి03:40 PM (IST) Apr 18
కారు కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. ఒకప్పుడు కేవలం లగ్జరీగా భావించిన కారు, ఇప్పుడు నిత్యవసర వస్తువుగా మారిపోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత కారును ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో సెకండ్ హ్యాండ్ కార్ల వినియోగం పెరిగింది. అయితే బ్యాంకులు ఆఫర్లతో కొత్త కార్లకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే హ్యుందాయ్ క్రెటాపై మంచి డీల్ లభిస్తోంది. ఈ కారును సొంతం చేసుకోవాలంటే ఎంత డౌన్‌పేమెంట్ కట్టాలి.? ఈఎమ్ఐ ఎంత ఉంటుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
02:47 PM (IST) Apr 18
ఓ వైపు అమెరికా ప్రపంచ దేశాలపై టారిఫ్ ల దాడి చేస్తున్న తరుణంలో ప్రపంచ కుబేరుడు, అమెరికా ప్రభుత్వ డోజ్ విభాగం అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత ప్రధాని మోదీల మధ్య ఫోన్ సంభాషణ అందరినీ ఆకర్షించింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఏం మాట్లాడారు.? ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి
02:29 PM (IST) Apr 18
సునీల్ నరైన్... ఒకప్పుడు కేవలం బౌలర్ కాస్త ఇప్పుడు ఆల్ రౌండర్ గా మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం అతడు బౌలర్ కంటే బ్యాట్ మెన్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడిలోని హిట్టర్ ను బయటకు తీసుకువచ్చింది ఐపిఎల్ అనే చెప్పాలి. అలాంటి మెగా టోర్నీలో ఈ కెకెఆర్ ప్లేయర్ ఇల్లీగల్ బ్యాట్ ను ఉపయోగించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పూర్తి కథనం చదవండి02:26 PM (IST) Apr 18
కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకు అనుగుణంగానే కృషి చేస్తుంటారు. అయితే తెలిసో, తెలియకో మనం చేసే కొన్ని తప్పులు మనల్ని వెనక్కిలాగుతుంటాయి. ముఖ్యంగా వృత్తిపరంగా సక్సెస్ కావాలనుకునే వారు కచ్చితంగా కొన్ని రకాల తప్పులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి01:49 PM (IST) Apr 18
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోన్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత హైటెక్ సిటీని పోలిన విధంగానే మరో ఐటీ నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు.
12:50 PM (IST) Apr 18
భగవద్గీతకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో నిర్వహించే మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో భగవద్గీతకు చోటు దక్కింది. అలాగే భారత ప్రాచీన నాట్యకళకు మౌలిక గ్రంథంగా పరిగణించే భరతముని రచన "నాట్య శాస్త్రం" కూడా ఇదే జాబితాలో చేరింది. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు..
12:15 PM (IST) Apr 18
కన్నౌర్ లోకేష్ రాహుల్ ... ఈ పేరు మీరు వినివుండక పోవచ్చు... కానీ కె.ఎల్. రాహుల్ అసలు పేరు. ఇవాళ ఈ భారతీయ క్రికెటర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన పూర్తిపేరులాగే చాలామందికి కెఎల్ రాహుల్ కు సంబంధించిన చాలా విషయాలు తెలియవు. అలాంటి ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
11:13 AM (IST) Apr 18
బంగారం ... భారతీయులకు ఇది ఓ ఖనిజం కాదు ఓ ఎమోషన్. ఆడవాళ్లు తమదగ్గర కిలోలకొద్దీ బంగారం ఉన్నా తృప్తిపడరు... ఇంకా కొనాలను చూస్తుంటారు. అయితే ప్రస్తుతం సామాన్యులు బంగారం కొనే పరిస్థితులు కనిపించడం లేదు. తులం బంగారం ధర ప్రస్తుతం లక్ష రూపాయలకు చేరువయ్యింది. ఇలా బంగారం ధరలు పెరగడానికి గల టాప్ 6 రీజన్స్ ఇవే..
పూర్తి కథనం చదవండి09:49 AM (IST) Apr 18
ఈ రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లచల్లగా, వేేడివేడిగా ఉండనుంది. ప్రస్తుతం ఎండాకాలం కొనసాగుతున్నా చిరుజల్లులు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడుతోంది. ఇదే పరిస్థితి ఇంకొన్నిరోజులు ఉండనుంది. ఏ జిల్లాల్లో జల్లులు కురుస్తాయి? ఏ జిల్లాల్లో ఎండలు మండిపోతాయి? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:47 AM (IST) Apr 18
Empuraan OTT Release Date: మోహన్‌లాల్ నటించిన, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఎంపురాన్ ఓటీటీ విడుదల తేదీ ప్రకటించబడింది.
పూర్తి కథనం చదవండి