- Home
- Sports
- Cricket
- KL Rahul Birthday: కేఎల్ రాహుల్ పూర్తి పేరేంటో తెలుసా? అతడి సంపాదన, కార్ల కలెక్షన్ గురించి తెలిస్తే మతిపోతుంది
KL Rahul Birthday: కేఎల్ రాహుల్ పూర్తి పేరేంటో తెలుసా? అతడి సంపాదన, కార్ల కలెక్షన్ గురించి తెలిస్తే మతిపోతుంది
కన్నౌర్ లోకేష్ రాహుల్ ... ఈ పేరు మీరు వినివుండక పోవచ్చు... కానీ కె.ఎల్. రాహుల్ అసలు పేరు. ఇవాళ ఈ భారతీయ క్రికెటర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన పూర్తిపేరులాగే చాలామందికి కెఎల్ రాహుల్ కు సంబంధించిన చాలా విషయాలు తెలియవు. అలాంటి ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

KL Rahul Birthday
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్న కెఎల్ రాహుల్ ఇవాళ(శుక్రవారం) తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మంచి ఫిట్ నెస్ తో పాటు సినిమా హీరో లుక్ లో ఉంటాడు రాహుల్... అందుకేనేమో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి తన ముద్దుల కూతురు అతియా శెట్టిని ఇచ్చి పెళ్లిచేసాడు. ఇటీవలే రాహుల్, అతియాా దంపతులు తల్లిదండ్రులు అయ్యారు... అతియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఇలా రాహుల్ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ సాఫీగా సాగుతోంది. కెఎల్ రాహుల్ పుట్టినరోజు సందర్భంగా అతడిగురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
KL Rahul
కెఎల్ రాహుల్ క్రికెట్ ద్వారా మంచిపేరు మాత్రమే కాదు బాగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. అతడితో పాటు ఇప్పుడు భార్య సంపాదన కూడా యాడ్ అయ్యింది. అతడి భార్య అతియా బాలీవుడ్ యాక్టర్. ఇలా భార్యాభర్తలిద్దరూ రెండుచేతులా సంపాదిస్తున్నారు.
ప్రస్తుతం కెఎల్ రాహుల్ వద్ద డబ్బుకు కొదవలేదు. ఆయనే ఒక పెద్ద క్రికెటర్, భార్య బాలీవుడ్ నటి. ఆయన నికర సంపద దాదాపు రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
KL Rahul
క్రికెటర్ రాహుల్ బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్ ఎ లో ఉన్నారు, దీని ద్వారా ఆయనకు ఏడాదికి రూ.5 కోట్లు లభిస్తాయి. అలాగే యాడ్స్, ఇతర మార్గాల ద్వారా కూడా రాహుల్ కు ఆదాయం వస్తుంది. దీంతో అతడు లగ్జరీ జీవితం గడుపుతున్నాడు.
రాహుల్ వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి... వాటిలో తిరగడం అతడికి చాలా ఇష్టం. ఆయన వద్ద అద్భుతమైన కార్ల సేకరణ ఉంది. ఇలా కెఎల్ రాహుల్ వద్ద లంబోర్ఘిని, బిఎండబ్ల్యు 5 సిరీస్, ఆస్టన్ మార్టిన్ డిబి11, మెర్సిడెస్ బెంజ్ సి43 ఉన్నాయి. ఈ కార్ల ధర చాలా ఎక్కువ.
KL Rahul
ఐపీఎల్ 2025 జీతం ఎంత?
ఐపీఎల్ 2025 కి ముందు మూడు సీజన్లలో కెఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడారు, దీనికి ఆయనకు రూ.17 కోట్లు లభించాయి. ఇప్పుడు ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నారు, ఆయనకు రూ.14 కోట్లు లభిస్తున్నాయి.
KL Rahul
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌కు కెఎల్ రాహుల్ దూరమయ్యారు. ఎందుకంటే అదే రోజు ఆయన భార్య అతియా శెట్టి ఒక పాపకు జన్మనిచ్చింది... ఇలా రాహుల్ ఇటీవలే తండ్రి అయ్యారు. డెలివరీ సమయంలో భార్యతో ఉన్న ఇతడు ఆ తర్వాత వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరారు. డిల్లీ తరపున ఇటీవల ఓ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి మరోసారి తన సత్తాఏంటో నిరూపించుకున్నాడు.