MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price : లక్షకు చేరువలో తులం బంగారం... ఒక్కరోజే ఇంత పెరిగిందా? ఇంతలా పెరగడానికి టాప్ 6 రీజన్స్

Gold Price : లక్షకు చేరువలో తులం బంగారం... ఒక్కరోజే ఇంత పెరిగిందా? ఇంతలా పెరగడానికి టాప్ 6 రీజన్స్

బంగారం ... భారతీయులకు ఇది ఓ ఖనిజం కాదు ఓ ఎమోషన్. ఆడవాళ్లు తమదగ్గర కిలోలకొద్దీ బంగారం ఉన్నా తృప్తిపడరు... ఇంకా కొనాలని చూస్తుంటారు. అయితే  ప్రస్తుతం సామాన్యులు బంగారం కొనే పరిస్థితులు కనిపించడం లేదు. తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరువయ్యింది. ఇలా బంగారం ధరలు పెరగడానికి గల టాప్ 6 రీజన్స్ ఇవే.. 

3 Min read
Arun Kumar P
Published : Apr 18 2025, 11:13 AM IST | Updated : Apr 18 2025, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Gold Price

Gold Price

Gold Price : అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇరుదేశాల టారీప్స్ పెంపుతో అంతర్జాతీయ మార్కెట్ అతలాకుతలం అవుతోంది...  పెట్టుబడిదారులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో సేఫ్ పెట్టుబడులవైపు చూస్తున్నవారు బంగారంపై పడ్డారు. దీంతో బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్ లోనే కాదు భారత్ లో కూడా బంగారం ధరలు పైపైకి వెళుతున్నాయి. ఇప్పటికే ఇది సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంది. ప్రస్తుతం తులం బంగారం ధర లక్షకు చేరువయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతిత్వరలో తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. 

25
Gold Price in Hyderabad

Gold Price in Hyderabad

హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత? 

చాలాకాలంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇటీవలకాలంలో పెరిగుతున్నంత వేగంగా  ఎప్పుడూ పెరగలేవు. రోజురోజుకు పదులు, వందల్లో కాదు ఏకంగా వేలల్లో బంగారం ధర పెరుగుతోంది. ఇలా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరువయ్యింది. 

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.97,310 ధర పలుకుతోంది. నిన్న రూ.990 పెరగగా ఇవాళ ఏకంగా రూ.1140 పెరిగింది. ఇదే పెరుగుదల కొనసాగితే ఈ నెలాఖరుకు తులం బంగారం ధర లక్ష దాటుతుంది. 

ఇదిలావుంటే 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో రూ.89,200 గా ఉంది. ఇది గురువారం రూ.950, శుక్రవారం రూ.1050 పెరిగింది. ఇలా బంగారం ధరలు అమాంతం పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ తో పాటు దేశంలో పెరిగిన కొనుగోళ్లు కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్ళిళ్ల సీజన్ కావడంతో బంగారంకు రెక్కలు వచ్చినట్లు తెలుస్తోంది. 
 

35
Gold Price

Gold Price

బంగారం ధరల పెరుగుదలకు టాప్ 5 రీజన్స్ ఇవే : 

1. అమెరికా-చైనా వాణిజ్య యుద్దం :  

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టింది మొదలు సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతికార సుంకాల పేరిట అతడు తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా అగ్రదేశాలు అమెరికా, చైనా మధ్య నడుస్తున్న టారీఫ్స్ యుద్దం అన్నిరంగాలను ప్రభావితం చేస్తోంది. ఇలా బంగారం ధరపై కూడా ఈ ప్రభావం పడింది... ఇరుదేశాల టారీఫ్స్ దెబ్బకు పసిడి ధర పరుగుపెడుతోంది. 

అగ్రదేశాల ట్రేడ్ వార్ కారణంగా ఆర్థిక వృద్ధి రేటు తగ్గొచ్చనే అనుమానాలున్నాయి. అలాగే గ్లోబల్ మాంద్యం కూడా రావొచ్చని భావిస్తున్నారు. అందుకే చాలామంది బంగారం మీద పెట్టుబడి పెట్టేందకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో బంగారంకు రెక్కలు వచ్చాయి. 
 

45
<p>bhima jewellers showroom relaunch at sharjah</p>

<p>bhima jewellers showroom relaunch at sharjah</p>

2.  ఆర్థిక మాంద్యం భయాలు : 

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాలో మాంద్యం వస్తుందనే భయం పట్టుకుంది. ఇదే జరిగితే రేట్లు పెరుగుతాయనే అంచనాల వల్ల ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మీద వడ్డీ రేట్లు తగ్గించమని ఒత్తిడి ఉంది. దీనివల్ల కూడా బంగారం రేటుకి సపోర్ట్ దొరుకుతోంది.
 
3. అంతర్జాతీయస్థాయి ఆందోళనలు : 
 
అమెరికా, చైనా ట్రేడ్ వార్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధరల పెంపుకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియాలో జియోపాలిటికల్ టెన్షన్లు కూడా ఇందుకు కారణమే. ఇవి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే వాళ్ళు బంగారం మీద పెట్టుబడి పెంచారు. దీంతో బంగారం రేట్లు పెరుగుతున్నాయి.
 
4.  రూపాయి బలహీనపడటం

డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీనంగా ఉండటం వల్ల బంగారం రేట్లు పెరుగుతున్నాయి. రూపాయి బలహీనంగా ఉంటే దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఏడాదిలో రూపాయి 4% పడిపోయింది.
 

55
gold price

gold price

5. సెంట్రల్ బ్యాంక్ ల బంగారం కొనుగోళ్లు

ప్రపంచంలో అనిశ్చితి పెరగడం వల్ల ఇండియానే కాదు చైనా, ఇంకా చాలా సెంట్రల్ బ్యాంకులు బంగారం కొంటున్నాయి. దీనివల్ల బంగారం రేటు పెరుగుతోంది.

6. బంగారు ఆభరణాల డిమాండ్ పెరుగుతోంది

ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ వస్తోంది. దీనివల్ల బంగారు ఆభరణాల డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై లాంటి నగరాల్లో రేట్లు ఎక్కువైనా అమ్మకాలు జోరుగా ఉన్నాయి.
 
 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
బంగారం
భారత దేశం
స్టాక్ మార్కెట్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved