గురువారం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో రాజీవ్ యువవికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై సమీక్ష, కాళేశ్వరం విజిలెన్స్ తో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక తెలంగాణ హ్యుందాయ్ రూ. 8 వేల కోట్లకి పైగా పెట్టుబడులు పెట్టనుంది. అమరావతిలో లా వర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడింది. ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ సందర్భంగా తొక్కిసలాటతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

10:44 PM (IST) Jun 05
Bengaluru stampede: బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య కఠిన చర్యలు తీసుకున్నారు. ఆర్సీబీ, కేఎస్‌సీఏపై కేసు నమోదుతో పాటు వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అలాగే, పోలీస్ అధికారుల సస్పెన్షన్ కు ఆదేశాలిచ్చారు.
10:06 PM (IST) Jun 05
Holiday: జూన్ 6ను జాతీయ సెలవుగా ప్రకటించారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది.
08:38 PM (IST) Jun 05
RCB: బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై ఆర్సీబీ స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
07:54 PM (IST) Jun 05
Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
07:09 PM (IST) Jun 05
RCB: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట క్రమంలో ఆర్సీబీ (RCB), కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA)పై క్రిమినల్ నిర్లక్ష్యానికి సంబంధించి ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఈ కేసును సీఐడీకి అప్పగించారు.
06:37 PM (IST) Jun 05
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా, బిజు జనతాదళ్ (బీజేడీ) నేత పినాకీ మిశ్రా మే 3న జర్మనీలో వివాహం చేసుకున్నారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, అధికారికంగా ధృవీకరణ ఇంకా లేదు.
05:55 PM (IST) Jun 05
Mahua Moitra: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా మరో సారి వార్తల్లో నిలిచారు. జర్మనీలో మే 3న ఆమె పినాకీ మిశ్రాను వివాహం చేసుకున్నారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
05:16 PM (IST) Jun 05
Pawan Kalyan: పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న వన మహోత్సవంలో 5 కోట్ల మొక్కల లక్ష్యాన్ని ప్రకటించారు.
04:23 PM (IST) Jun 05
Builder ai: బిల్డర్.ఏఐ చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఏఐ మోసాలు సహా తీవ్ర ఆరోపణల మధ్య దివాళా ప్రకటన చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
03:24 PM (IST) Jun 05
దేశంలో యూపీఐ సేవలు భారీగా విస్తరిస్తున్నాయి. ప్రతీ చిన్న లావాదేవీకి ఫోన్‌పే, గూగుల్‌పేలను ఉపయోగిస్తున్నారు. తాజాగా యూపీఐ పేమెంట్స్ సేవల్లో నిబంధనలను సవరించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
02:30 PM (IST) Jun 05
సాధారణంగా గోల్డ్ మైనింగ్ అంటే ఎక్కడో విదేశాల్లో జరుగుతుందని అనుకుంటాం. అయితే భారత్‌లో అదికూడా ఆంధ్రప్రదేశ్‌లో బంగారు గనులు ఉన్నాయంటే నమ్ముతారా.? దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన తొలి గోల్డ్ మైనింగ్‌కు సంబంధించిన కథనం ఇప్పుడు తెలుసుకుందాం.
12:44 PM (IST) Jun 05
భారతదేశంలో జనాభా లెక్కలు 16 ఏళ్ల విరామం తర్వాత 2027 మార్చి 1 నాటికి పూర్తయ్యేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూన్ 4న (2025) ప్రకటించింది. ఇది స్వతంత్ర భారతదేశంలో మొదటి డిజిటల్ జనగణన కావడం విశేషం.
12:09 PM (IST) Jun 05
పహల్గాం దాడిని భారతదేశంలో ముస్లింలను క్రూరులుగా చిత్రీకరించడానికి ఉపయోగిస్తున్నారనే బిలావల్ భుట్టో వ్యాఖ్యలను ఈజిప్ట్ జర్నలిస్ట్ ఖండించారు.
11:25 AM (IST) Jun 05
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన విషాదం యావత్ దేశాన్ని కుదిపి వేసింది. అభిమాన క్రికెటర్లను చూడాలనుకున్న వారు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. దీంతో ఇప్పుడీ అంశం చుట్టూ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.