ఆర్టికల్ 370 రద్దు: జమ్మూకాశ్మీర్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Aug 13, 2019, 3:35 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం చోటు చేసుకొనేలా కేంద్రం చర్యలు తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు మెరుగయ్యేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  జమ్మూకాశ్మీర్ ‌పరిస్థితి అత్యంత సున్నితమైందని,  ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్ లో ఆంక్షలు విధించారని సుప్రీంకోర్టులో తెహసీన్ పూనవాల పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారించింది. జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ను అడిగి తెలుసుకొన్నారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రోజు రోజుకు పరిస్థితులు మెరుగు పడుతున్నట్టుగా వేణుగోపాల్ కోర్టుకు వివరించారు. ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటుందని అటార్నీ జనరల్ చెప్పారు. 

సాధరణ పరిస్థితులు నెలకొంటే ఆంక్షలు ఎత్తివేస్తామని కోర్టుకు అటార్నీ జనరల్ వివరించారు. 2016లో మూడు మాసాల పాటు ఆంక్షలు విధించిన విషయాన్ని వేణుగోపాల్ గుర్తు చేశారు. ఈ సమయంలో  47 మంది మృత్యు వాత పడ్డారని  అటార్నీ జనరల్  సుప్రీంకు తెలిపారు. 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజల  హక్కుల రక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి సమయాన్ని ఇవ్వాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

ఈ విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోవడం తొందరపాటే అవుతోందని సుప్రీం వ్యాఖ్యానించింది.పరిస్థితుల్లో మార్పులు రాకపోతే అప్పుడు తాము జోక్యం చేసుకొంటామని సుప్రీంకోర్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

ఆర్టికల్ 370 రద్దు: లడ్దాఖ్ సమీపంలో పాక్ యుద్ద విమానాలు

యుద్దం తప్పదేమో: 370 ఆర్టికల్ రద్దుపై ఇమ్రాన్ సంచలనం

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం తెలుసు: అమిత్ షా

ఆర్టికల్ 370 రద్దుపై చైనా దుర్బుద్ధి: వత్తాసు పలికిన పాకిస్తాన్

మరో పుల్వామా దాడి: ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్ ఖాన్ సంచలనం

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

 

click me!