రివర్స్ టెండరింగ్ కాదు రిజర్వు టెండర్: మాజీమంత్రి ఆలపాటి రాజా ఫైర్

By Nagaraju penumala  |  First Published Sep 21, 2019, 6:21 PM IST

అర్హత లేని గుత్తేదార్లను హెడ్ వర్క్స్ పనులు కట్టబెడుతున్నారని అది చాలా దారుణమన్నారు. అలాంటి వారి వల్ల ప్రాజెక్టు నాణ్యతకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా అవినీతి జరగలేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 


గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి ఆలపాటి రాజా. రాష్ట్రాన్ని సీఎం జగన్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియే అందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. 

గతంలో వైఎస్ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన విషయాన్ని గుర్తుకు తెస్తున్నారని విమర్శించారు. గతంలో పనులు బాగా చేసిన గుత్తేదార్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లటం సరికాదన్నారు. 

Latest Videos

టీడీపీ హయాంలో పోలవరం పనుల వేగంలో గిన్సిస్ బుక్ రికార్డు సాధించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. దేశంలోని మిగతా 15 జాతీయ ప్రాజెక్టుల కంటే పోలవరం వేగంగా పనులు చేసిన ఘనత గత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్క శాతం పనులు కూడా సరిగా చేయని మాక్స్ ఇన్‌ ఫ్రా టెక్ కు  టెండర్లు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రివర్స్ టెండరింగ్ పై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 

అర్హత లేని గుత్తేదార్లను హెడ్ వర్క్స్ పనులు కట్టబెడుతున్నారని అది చాలా దారుణమన్నారు. అలాంటి వారి వల్ల ప్రాజెక్టు నాణ్యతకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా అవినీతి జరగలేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.  

ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అర్హత లేని వారికి కాంట్రాక్టు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. కావాల్సిన వారికి కాంట్రాక్టులు ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత ఆలస్యంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది రివర్స్ టెండరింగ్ కాదని రిజర్వు టెండర్ అని వ్యాఖ్యానించారు మాజీమంత్రి ఆలపాటి రాజా.

ఈ వార్తలు కూడా చదవండి

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదే: రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై జేసీ

అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్

జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

click me!