దేవుడికి కొబ్బరి కాయను ఎందుకు కొడతారు?

First Published Feb 13, 2024, 10:11 AM IST

ఇంట్లో దేవుడికి పూజ చేసేటప్పుడు దీపాలు వెలిగించి, అగర్బత్తీలు ముట్టించి కొబ్బరి కాయ కొడతారు. దేవుడికి కొబ్బరి కాయను కొట్టే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అసలు దేవుడికి కొబ్బరి కాయ ఎందుకు కొట్టాలి? కొబ్బరి కాయ కొట్టడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్కృతుల్లో కొబ్బరి పవిత్రమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనికున్న ప్రత్యేక లక్షణాలు స్వచ్ఛత, సంతానోత్పత్తి, దైవ ఆశీర్వాదాలను సూచిస్తాయి. గుడికి వెళ్లినా, ఇంట్లో దేవుడికి పూజ చేసినా మనం ఖచ్చితంగా కొబ్బరి కాయను కొడతాం. ఆ తర్వాత దీన్ని ప్రసాదంగా పంచి పెడతాం. అసలు కొబ్బరి కాయను దేవుడికి ఎందుకు కొడతామో తెలుసా? 

కొబ్బరికాయ బాహ్య కవచం అంటే పై భాగం రక్షణను సూచిస్తుంది. ఇక టెంకాయలో ఉండే తెల్లని గుజ్జు అంతర్గత స్వచ్ఛతను సూచిస్తుంది. ఈ బహుముఖ కాయను మనం ఎక్కువగా వేడుకలు, నైవేద్యాలలో ఉపయోగిస్తాం. ఈ కాయ శుభ ప్రారంభాలు, ఆధ్యాత్మిక స్వచ్ఛతను కూడా సూచిస్తుంది. అందుకే టెంకాయను ఎన్నో ఏండ్ల నుంచి దేవుడికి సమర్పిస్తూ వస్తున్నారు.
 

కొబ్బరికాయ, పురాణాలు

సంస్కృతంలో "నరికెల" అని పిలువబడే కొబ్బరికాయ దక్షిణాసియా సంప్రదాయాలలో బాగా పాతుకుపోయిన గొప్ప సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. "నరికెలా" అనే పేరు ఆదిమవాసుల పదంగా భావిస్తారు. "నియోర్" నూనెను సూచిస్తుంది. "కోలై" గింజను సూచిస్తుంది. సంస్కృతంలో "శ్రీఫల" అని పిలువబడే కొబ్బరికాయను "దేవుని ఫలం" అని అంటారు. ఇది బౌద్ధమతంలోని మహాభారతం, రామాయణం, పురాణాలు, జాతక కథలు వంటి పురాతన గ్రంథాలలో కనిపిస్తుంది.
 

క్రీ.శ 6 వ శతాబ్దానికి ముందు కొబ్బరికాయ గృహ ఆచారాలలో పవిత్రతను పొందింది. దేవతలకు పవిత్ర నైవేద్యంగా దీనిని ఉపయోగించేవారు. అలాగే పండుగలు, వేడుకల సమయంలో విలువైన బహుమతిగా ఇది మారింది. అగ్ని పురాణం, బ్రహ్మ పురాణం సమయంలో మతపరమైన ఆచారాలలో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. అప్పట్లో దీన్ని ఔషదమొక్కగానే కాకుండా వాతావరణ స్వచ్ఛత, అందం,  ప్రశాంతతకు అవసరమైన అంశంగా కూడా పరిగణించేవారు. 

మత్స్య పురాణం ప్రకారం.. కొబ్బరి చెట్లతో పాటుగా ఇతర పవిత్ర చెట్లను మన తోటలో నాటడం వల్ల శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అలాగే మన సంపద కూడా పెరుగుతుందనే నమ్మకం ఉంది. శివుడు వినాయకుడికి కొబ్బరి కాయను ఇచ్చాడని కూడా చెప్తారు. అందుకే కొబ్బరి కాయకు అంత ప్రాముఖ్యత ఉంది. 
 

Coconut


కొబ్బరికాయ, నమ్మకాలు

హిందూ మతంలో.. కొబ్బరికాయ.. సృష్టికర్త, రక్షకుడు, వినాశకుడు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. భక్తులు కొబ్బరికాయను ఆరాధనా వస్తువుగా భావిస్తారు. దేవుడికి కొబ్బరి కాయను దేవుడికి సమర్పించడం వల్ల త్రిమూర్తుల ఆశీస్సులు పొందుతారనే నమ్మకం ఉంది. పురాణాల ప్రకారం.. మహావిష్ణువు భూలోకానికి వచ్చినప్పుడు మానవాళి శ్రేయస్సు కోసం లక్ష్మీదేవి, కొబ్బరి చెట్టును, కామధేను ఆవును భూలోకానికి తీసుకొచ్చారట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు.. ముగ్గురు దేవుళ్లకు కొబ్బరికాయను చిహ్నంగా భావించడానికి ఇది కూడా ఒక కారణమే. 
 

మరొక నమ్మకం ప్రకారం.. కొబ్బరికాయలోని వివిధ భాగాలు దేవుళ్లను, దేవుతలను సూచిస్తాయి. కొబ్బరికాయలోని తెల్లగుజ్జు పార్వతీ దేవికి చిహ్నంగా భావిస్తారు. ఇక కాయలోని లోపలి నీరు.. పవిత్రమైన గంగా నదితో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే గోధుమ రంగు కవచం కార్తికేయుడిని సూచిస్తుంది. అందుకే కొబ్బరి కాయను పవిత్రంగా భావిస్తారు. అందుకే హిందూ మతంలో  కొబ్బరికాయ ఇంత ఆధ్యాత్మిక  సంబంధాన్ని కలిగి ఉంది. 
 

కొబ్బరికాయ ప్రాముఖ్యత

దేవుడి ముందు కొబ్బరికాయను  కొట్టడం ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో చాలా ముఖ్యమైందిగా పరిగణిస్తారు. ముఖ్యంగా హిందూ మతంలో ఇది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. కొబ్బరికాయలోని ప్రతి భాగం మానవ స్వభావం, ఆధ్యాత్మిక ప్రయాణం వంటి వివిధ అంశాలను సూచిస్తుందని నమ్ముతారు. కొబ్బరికాయ గట్టి బాహ్య చిప్ప అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయను పగలగొట్టడం అనేది ఒకరి అహంకారాన్ని పోగొట్టడం, లేదా అహంకారాన్ని విడిచిపెట్టడానికి సంకేతంగా భావిస్తారు. ఇక కొబ్బరి లోపల మృదువైన గుజ్జు భాగాన్ని మానవ హృదయంగా భావిస్తారు. కొబ్బరికాయ పగలగొట్టడం అనేది ఒక వ్యక్తి హృదయాన్ని తెరవడం, వినయం, కరుణను పెంపొందించడాన్ని సూచిస్తుంది. ఇక కొబ్బరి లోపల నీరు స్వచ్ఛతకు ప్రతీక. కొబ్బరికాయను పగులగొట్టి దాని నీటిని సమర్పించడం వల్ల తనని తాను శుద్ధి చేసుకుని, హృదయాన్ని, ఆత్మను శుభ్రపరుచుకోవడాన్ని సూచిస్తుంది.

జంతు, మానవ బలి స్థానంలో కొబ్బరి

దక్షిణ భారతదేశంలో కొబ్బరి చెట్లు సమృద్ధిగా ఉన్న కాలంలో మనుషులు, జంతువులతో కూడిన బలి రూపాల నుంచి కొబ్బరికాయల వాడకానికి మారిందని నమ్ముతారు. కొబ్బరికాయ మానవ శరీర నిర్మాణ శాస్త్రం వివిధ అంశాలతో స్పష్టమైన పోలికలను కలిగి ఉంది. బయట ఉన్న పీచును మనిషి వెంట్రుకలతో పోలుస్తారు. గట్టి టెంకను మానవ పుర్రెతో పోలుస్తారు. అలాగే కొబ్బరి లోపలి నీటిని మానవ రక్తంతో పోలుస్తారు. తెల్లని గుజ్జును మానవ మెదడును పోలి ఉంటుంది. ఈ ప్రతీకాత్మక పోలికలు బహుశా ఇతర రకాల నైవేద్యాల నుంచి కొబ్బరికాయలకు మారడంలో పాత్ర పోషించాయని చెప్తారు.

click me!