స్వీయ అవగాహన ప్రాముఖ్యతను తెలియజేసే ప్రయత్నం
యూఐ సినిమా ద్వారా తాము ఆడియన్స్ కు ఒక విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశామని ఉపేంద్ర తెలిపారు. స్వీయ అవగాహన ప్రాముఖ్యత ఎంత గొప్పదే ఈ సినిమాతో వివరించాలనుకున్నామన్నారు. ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని బాగానే స్వీకరించి, అర్థం చేసుకున్నారని ఉపేంద్ర చెప్పుకొచ్చారు.
క్లైమాక్స్ కీలకం..
సినిమాలోని చివరి సన్నివేశం కొంచెం క్లిష్టమైనదని, దాన్ని కొంతి మంది మాత్రమే అర్థం చేసుకున్నారని ఉపేంద్ర చెప్పుకొచ్చారు, యూఐ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపేంద్ర చిత్ర యూనిట్ తో కలిసి కేక్ కట్ చేసిన సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన ఆనందానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు.
అసలైన ఆనందం ఏంటంటే
ప్రతి ఒక్కరూ తమ జీవితాలను సరిగ్గా చూసుకుంటే అసలు సమస్యలే ఉండవని ఉపేంద్ర చెప్పుకొచ్చారు. ఇక స్వ విమర్శ, విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. అలాగే ఆనందం అనేది ఎక్కడి నుంచో రాదని, మనశ్శాంతే ఆనందం అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. నిజానికి చాలా మంది కారుల్లోనే, దుస్తుల్లోనే, అంతస్తుల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. కానీ అది ఏమాత్రం కరెక్ట్ కాదని ఒక్క మాటతో చెప్పేశారు ఉపేంద్ర.
ఇక యూఐ సినిమా సక్సెస్ పై కూడా ఉపేంద్ర స్పందించారు. సినిమా రొటీన్ ఫార్ములాను మించి తాను ప్రయత్నించానని, ప్రేక్షకులు దాన్ని ఆదరించారని అన్నారు. తాను ఊహించిన దానికంటే భిన్నంగా ప్రేక్షకులు ఆలోచిస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలకు ప్రోత్సాహం ఉంటే మరింత ధైర్యంగా ప్రయత్నించవచ్చని చెప్పుకొచ్చారు. ఈ సినిమా విజయం ముమ్మాటికీ ప్రేక్షకులదేనని ఉపేంద్ర అన్నారు.
రామాయణ, మహాభారతాల గురించి..
రామాయణ, మహాభారతాలు ఎప్పుడూ ప్రస్తుతమేనని, వాటి ఆధారంగా చాలా మంది సినిమాలు తీస్తున్నారని, కాపీరైట్ సమస్య వస్తే అందరు దర్శకులూ వాల్మీకి, వ్యాసులకు కాపీరైట్ డబ్బులు ఇవ్వాలని నవ్వుతూ ఉన్నారు. వారు వేల సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలనే ఇప్పుడు దర్శకులు సినిమాలుగా తీస్తున్నారని అన్నారు.
ఇక సినిమా విజయం గురించి లహరి వేలు మాట్లాడుతూ, సినిమా బాగా హిట్ అయ్యిందని, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ సాధించిందని, అంచనాలకు మించి సినిమా విజయం సాధించిందని అన్నారు. నిర్మాతలు జి. మనోహరన్, నవీన్ మనోహరన్ తో సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొంది.