చలికాలం స్నానం చేసేప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? గుండెపోటుకు కారణం కావొచ్చు.

First Published | Dec 31, 2024, 8:13 AM IST

సాధారణంగా చలికాలం గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అయితే చలికాలం స్నానం చేసే సమయంలో చేసే కొన్ని తప్పులు ఈ రిస్క్ ను మరింత ఎక్కువ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటంటే.. 

చలికాలంలో స్నానం

చలికాలంలో గుండెపోటులు సర్వసాధారణం. చాలా సందర్భాల్లో, స్నానం చేసేటప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాత్ రూమ్ లో గుండెపోటు వచ్చి మరణించి సంఘటనలు కూడా చూసే ఉంటాం. అయితే చలికాలం స్నానం చేసేప్పుడు ఈ తప్పు చేయకపోతే గుండె పోటు బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

చలిలో, రక్తనాళాలు కుంచించుకుపోతాయి, గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది, దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 


సాధారణంగా చలికాలం చల్లటి నీటితో స్నానం చేస్తే ప్రమాదకరమని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేసినా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. ఎలాంటి నీరు అయినా స్నానం చేసే విధానం తప్పుగా ఉంటే గుండె పోటు ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. 

తలపై నీళ్లు పోసుకోవడం తప్పు

సాధారణంగా మనలో చాలా మంది స్నానం చేసే సమయంలో ఒక్కసారిగా నీటిని నేరుగా తలపై పోసుకుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. ఒక్కసారిగా తలపై నీరు పోసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

స్నానం చేయడానికి సరైన మార్గం ఏంటంటే.
చలికాలంలో చల్లటి నీళ్లతోనో, వేడి నీళ్లతోనో స్నానం చేసినా, మొదట తలపై నీళ్లు పోసుకోకూడదు.. ముందుగా, కాళ్లపై కొంచెం నీళ్లు పోసి రుద్దాలి. తర్వాత, కడుపుపై, ఆ తర్వాత ఛాతిపై నీళ్లు పోసుకోవాలి. ఇలా క్రమంగా చివరికి తలపై, ముఖంపై నీరు పోసుకోవాలి. 

ఇలా ప్రాణాలను కాపాడుకోవచ్చు
చలికాలంలో ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఒకరకమైన థర్మోస్టాట్ ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. ఇది శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితిలో ఉంచుతుంది. థర్మోస్టాట్ అనేది ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఉపయోగించే పరికరం.

ఈ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి

కొలెస్ట్రాల్ లేదా డయాబెటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రక్తపోటుతో బాధపడేవారు కూడా చలికాలం స్నానం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకవాలని సూచిస్తున్నారు. కాళ్ల నొప్పులు, అలసట, చలికాలంలో ఛాతి నొప్పి వంటి సమస్యలు గుండె ఆరోగ్యం బాగాలేదనడానికి సంకేతంగా భావించాలి. ఇలాంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. 

Latest Videos

click me!