నవదుర్గల్లో ఆరో అవతారం కాత్యాయని దుర్గ అవతారం. నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని భక్తులు పూజిస్తారు. ఈరోజు ఎంతో పూజలు అందుకున్న ఇప్పుడు అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. అమరకోశం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయని. అమ్మవారిని దుర్గదేవిగా వర్ణించారు. కాత్యాయని మహర్షి పుత్రిక కాబట్టి ఆమెకు కాత్యాయనిగా పేరు వచ్చింది.
అమ్మవారు చతుర్భుజి అభయముద్ర, వరముద్ర, ఖడ్గం,కమలముతో మనకు ఈరోజు పులి వాహనం మీద దర్శనం ఇస్తారు. ఈ రోజున కొలిచే కాత్యాయినీ మాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది.
భద్రకాళి అవతారమెత్తి ఆశ్వయుజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది. ఈ అమ్మవారి దర్శనం సకల ముక్తప్రదాయకం. అమ్మవారు మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
శ్రీ భగవాడున్ని భర్తగా పొందాలని గోపికలు అందరూ కూడా రేపల్లిలో కాత్యాయని వ్రతం చేశారు అని చెప్పి భాగవతం చెబుతుంది. అంటే ఈ మహ తల్లిని పూజించిన ఎడల మంచి భర్తను పొందగలరు అని చెబుతారు.
అమ్మవారు దుర్గా దేవిగా కనిపించి మోక్షానికి తీసుకు పోవుటకు దర్శనం ఇస్తుంది. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయనీదేవి గురించి ప్రస్తావస్తూ ఓడిశా ప్రదేశం జగన్నాధునికీ, కాత్యాయనీ దేవికి పీట వంటిది అని వివరించారు.
అమ్మవారి ధ్యాన శ్లోకం: చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా!కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ!! ఈ అమ్మవారిని పూజించిన సంతానం లేని వారికి సంతానం, వివాహం కావలసిన వారికి వివాహం కలుగును. ఈ కాత్యాయిని దేవత యొక్క ఆరాధన మనో అభీష్టములన్ని కూడా సిద్ధింప చేస్తుంది. ఈ రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి ఆ తల్లి కనక దుర్గమ్మ మహాలక్ష్మి స్వరూపంతో ఉపసిల్లుతూ ఉంటుంది.
అద్భుతమైన ఈ స్వరూపం మహాలక్ష్మి , మహాలక్ష్మి అంటే ఆరాధనలో కాత్యాయని దుర్గ, అలంకరణలో అమ్మవారిని మహాలక్ష్మీ స్వరూపంగా భావించి ఆ తల్లి ఆరాధన చేస్తారు. ఈ తల్లికి ఈ రోజు నైవేద్యంగా పాయసం, వడపప్పు, పానకం సమర్పిస్తారు. ఈ అమ్మవారు కాశీతో పాటు కర్ణాటకలోని అవెరస్సాలో ఉన్న కాత్యాయని బానేఈశ్వర్ ఆలయంల కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.