Rajinikanth
రజనీకాంత్ ప్రస్తుతం సౌత్‌లోనే సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఇప్పుడు ఊపందుకుంది. కానీ దాన్ని ఇరవై ఏళ్ల క్రితమే చేసి చూపించారు. `శివాజీ`, `రోబో`తోనే ఇండియన్ సినిమాని షేక్ చేశాడు రజనీకాంత్. స్టయిల్‌తోనే బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించాడు. ఇప్పటికీ చాలా కంపెనీలు రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే ఏకంగా హాలీడే ప్రకటిస్తుంటాయి. అది రజనీ క్రేజ్.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Rajinikanth
బస్ కండక్టర్ నుంచి నటుడిగా మారి, చిన్న చిన్న పాత్రలు చేస్తూ, నెగటివ్ రోల్స్ చేస్తూ నటుడిగా ఎదిగారు రజనీకాంత్. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. నెమ్మదిగా హిట్లు అందుకుంటూ తానేంటో నిరూపించుకున్నారు. హీరోగా, స్టార్ హీరోగా, సూపర్ స్టార్‌గా ఎదిగారు. తన సమకాలీకుడు, తనకంటే ముందు వచ్చిన కమల్ హాసన్‌కి పోటీగా ఎదిగాడు. ఇంకా చెప్పాలంటే కమర్షియల్ యాంగిల్‌లో, మాస్ ఇమేజ్ కోణంలో కమల్‌ని మించి ఎదిగాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Rajinikanth, Vettaiyan, OTT release date
అయితే రజనీకాంత్ ఇప్పుడు చాలా సౌమ్యంగా, కూల్‌గా, కామ్‌గా ఉన్నారు. ఆథ్యాత్మిక విషయాలకు ప్రయారిటీ ఇస్తారు. ఎక్కువగా యోగా, ధ్యానం చేస్తుంటారు. ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తుంటారు రజనీకాంత్. మానసికంగా ఆయన చాలా దృఢంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో అనేక అనారోగ్య సమస్యలను కూడా ఫేస్ చేసి నిలబడ్డాడు.
ఇప్పుడు కూల్‌గా కనిపించే రజనీ ప్రారంభంలో మాత్రం చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడట. నటుడిగా గుర్తింపు వస్తున్న సమయంలో, హీరోగా నిలబడుతున్న సమయంలోనే చాలా కోపంతో కనిపించేవాడట. ఓ సందర్భంలో చిరంజీవితో కూడా గొడవ పడ్డాడట. ఏదో విషయంలో ఇద్దరు వాగ్వాదానికి కూడా దిగారట.
చాలా హీటెడ్ ఆర్గ్యూమెంట్ జరిగిందని, ఆ తర్వాత మళ్లీ అది సెట్ అయ్యింది. ఇద్దరు మంచి స్నేహితులు కూడా అయ్యారని తెలిపారు మెగా బ్రదర్ నాగబాబు. తన ఎన్ మీడియా యూట్యూబ్ చానెల్‌లో ఈ విషయం వెల్లడించారు. రజనీకాంత్ జర్నీని వివరించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగానే ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు నాగబాబు. అప్పట్లో రజనీకాంత్ సినిమా గురించి ఓ మీడియా రిపోర్టర్ నెగటివ్‌గా రాశాడట. అది చూసి తట్టుకోలేకపోయిన రజనీకాంత్.. ఓ రిపోర్టర్‌ని కూడా కొట్టాడట. ఈ విషయాన్ని నాగబాబు వెల్లడించారు. అప్పట్లో మీడియా రిపోర్టర్‌పై చేయిచేసుకోవడం వల్ల మీడియా అంతా కక్ష్య కట్టారని, వరుసగా నెగటివ్‌గా ఆర్టికల్స్ రాశారని తెలిపారు.
రజనీకాంత్‌ని పిచ్చోడిగానూ వర్ణించారట. ఆయనకు పిచ్చి ఉందని, ప్రతి నెల టాబ్లెట్లు కూడా వాడుతుంటాడని కూడా రాశారట. ఆ సమయంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడట రజనీకాంత్. ఇలా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు రజనీకాంత్ అని తెలిపారు నాగబాబు.