డిసెంబర్ 31 లోపు మీరు ఈ పని చెయ్యకపోతే రూ.10 లక్షలు జరిమానా తప్పదు

First Published | Nov 27, 2024, 2:12 PM IST

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ హెచ్చరికలకు జారీ చేసింది. డిసెంబర్ 31 లోపు ఈ పని పూర్తి చేయాలని, లేకపోతే రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. అసలు ఈ ప్రకటన వెనుక ఉన్న విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం రండి. 

జనరల్ గా మనమందరం ట్యాక్స్ కడుతుంటాం. డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ విధానాల్లో పన్నులు చెల్లిస్తూనే ఉంటాం. అయితే కొంతమంది ట్యాక్స్ ఎగ్గొడుతుంటారు. అలాంటి వారికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

విదేశీ ఆస్తులు లేదా ఆదాయాన్ని వెల్లడించని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ వెంటనే వెల్లడించాలని కోరుతోంది. డిసెంబర్ 31, 2024 వరకు వారికి గడువు ఇచ్చింది. గడువులోపు విదేశీ ఆస్తులు లేదా ఆదాయాన్ని వెల్లడించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. 

విదేశీ ఆస్తులు లేదా ఆదాయాన్ని వెల్లడించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఆస్తుల సమాచారాన్ని దాచినందుకు రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించవచ్చు. విదేశీ ఆస్తులు, ఆదాయం గురించి సమాచారం తమ వద్ద ఉందని ఆదాయపు పన్ను శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది. ట్యాక్స్ పేయర్స్ స్వచ్ఛందంగా వారు విదేశీ ఆస్తుల సమాచారం వెల్లడించాలని, లేకుండా తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం నేరుగా వచ్చి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


తెలిసిన సమాచారం ప్రకారం వివిధ దేశాల్లో భారతీయులు కలిగి ఉన్న ఆర్థిక ఖాతాల సమాచారం ఆదాయపు పన్ను శాఖ సంపాదించింది. అందుకే ఈ పరిస్థితుల్లో ఆదాయాన్ని దాచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఖాతాదారుల పేరు, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య (TIN) వంటి వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. చట్టప్రకారం ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ వసూలు చేయడానికే ఆస్తుల వివరాలు అడుగుతున్నామని పేర్కొంది. 

విదేశాల్లో ఆస్తులు కలిగి ఉన్న వారి అకౌంట్ నంబర్, బ్యాలెన్స్ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు తెలుసు. వడ్డీ, డివిడెండ్ వంటి ఆదాయ వివరాలు కూడా ఉన్నాయి. మరి కొత్తగా ఆస్తి వివరాలు తెలపాలని ప్రకటన ఇవ్వడం వెనుక ఓ రీజన్ ఉంది. ట్యాక్స్ పే చేస్తున్న వారి అందరి నుంచి మొత్తం ఆదాయం గురించి, ఏఏ సోర్సుల ద్వారా వారికి ఈ ఇనకమ్ జనరేట్ అవుతోందో తెలుసుకోవడానికి సమాచారం సేకరిస్తున్నామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. వివరాలు సక్రమంగా, జన్యూన్ గా సమర్పించాలని కోరుతున్నారు.

Latest Videos

click me!