ఫౌజీ: ప్రభాస్ కు 150 కోట్లు, హీరోయిన్ కు మాత్రం అంత తక్కువా?

First Published | Nov 27, 2024, 1:08 PM IST

సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ, ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కేవలం ఇరవై లక్షలు మాత్రమే ఆమెకు రెమ్యునరేషన్ గా అందిస్తున్నారట. ఏడాది పాటు కాల్ షీట్స్ బ్లాక్ చేసుకున్నారని తెలుస్తోంది.

prabhas with iman ismail


సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఇమాన్వీ ...ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ హ‌నురాఘ‌వ‌పూడి కాంబోలో తెర‌కెక్కుతోన్న ఫౌజీ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది . మొదట ఈ మూవీలో హీరోయిన్ గా ప‌లువురు బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి.

కానీ వారంద‌రిని కాద‌ని ఇమాన్వీకి అవ‌కాశం ద‌క్క‌డం తెలుగు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌భాస్ మూవీలో ఇమాన్వీ హీరోయిన్‌గా ఎంపిక కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ ఒక్క‌సారిగా భారీగా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఆమెకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు..ఎన్ని రోజులు డేట్స్ తీసుకున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Iman Esmail


ఈ సినిమా యుద్ధం, ఆర్మీ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. యుద్ధం నేపథ్యంలో ఓ డీసెంట్ లవ్ స్టోరీని ఈ చిత్రం ద్వారా చూపించనున్నాడట హను రాఘవపూడి.

ఇందులో కొత్త అమ్మాయి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ బ్యూటీకి ఇది ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ మధురైలో స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే కొందరు యూనిట్ సభ్యులతో కలిసి అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ హను. 



1940 బ్యాక్‌డ్రాప్‌లో హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా ప్ర‌భాస్ మూవీని తెర‌కెక్కుతోన్నాడు డైరెక్ట‌ర్ హ‌నురాఘ‌వ‌పూడి. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియ‌ర్ హీరో మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో పాటు జ‌య‌ప్ర‌ద ఓ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.  మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.ఈ సినిమాకు విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. 
 


ఫౌజీ కోసం ప్రభాస్ కు 150 కోట్లు దాకా రెమ్యునేషన్ ఇస్తున్నారని సమాచారం. అదే సమయంలో  ఇమాన్వీ కోటి వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అందులో నిజం లేదంటున్నారు. కేవలం ఇరవై లక్షలు మాత్రమే ఆమెకు రెమ్యునరేషన్ గా అందిస్తున్నారట. అంత తక్కువా ప్రభాస్ హీరోయిన్ కు రెమ్యునరేషన్ అనేది చాలా మందిని ఆశ్చర్యంలో ముంచేస్తోంది. 
 


ప్రభాస్ వంటి స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్‌కి రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుంది. కానీ దర్శకుడు హను రాఘవపూడి కొత్త అమ్మాయిని, అది కూడా సోషల్‌ మీడియాలో రీల్స్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న అమ్మాయిని హీరోయిన్‌గా ఎంపిక చేయడం వల్ల పారితోషికం చాలా తక్కువగా ఉంది.

Prabhas, Hanu , Iman Esmail

పారితోషికం విషయంలోనే కాకుండా ఇమాన్వి డేట్ల విషయలోనూ దర్శకుడు హను రాఘవపూడికి అనుకూలంగా ఉందట. ప్రభాస్‌ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు డేట్లు ఇచ్చేది చెప్పలేని పరిస్థితి. అందుకే ఆయన డేట్లు ఎప్పుడు ఇస్తే అప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఇమాన్వితో ఏడాది పాటు ఒప్పందం చేసుకున్నారట.

Prabhas, Hanu , Iman Esmail

ఇమాన్వితో ఏడాది కాలం పాటు కాల్ షీట్స్ బ్లాక్ చేసుకున్నారని తెలుస్తోంది. ప్రత్యేకంగా, ఆమెకు బిజినెస్ క్లాస్ ప్రయాణం, 5-స్టార్ హోటల్ విడిది వంటి సౌకర్యాలను కూడా అందించబోతున్నారని వినికిడి.

ఇమాన్వి అమెరికాలో నివసిస్తున్న నేపథ్యంలో ఆమె ప్రాజెక్ట్ కోసం ఎప్పుడైతే ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్ కి డేట్స్ అందుబాటులో ఉంటాయో, అప్పుడు వెంటనే రప్పించేలా ఏర్పాట్లు చేసుకున్నారని టాక్. అందుకే ఆమె ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా ఒప్పుకోవడం లేదట.ఫౌజీ సెట్స్‌లోకి త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Latest Videos

click me!