వీటిని తింటే సెక్స్ లో మీరే కింగ్.. వయాగ్రా కూడా వేస్టే..

First Published | Jul 29, 2023, 10:37 AM IST

మీ మానసిక స్థితి, ఆరోగ్యం.. సెక్స్ కు సిద్ధం కాకపోతే మీకు ఏ మందు ఇచ్చినా పనిచేయదు. అయితే దీనికోసం కొన్ని ఆహారాలు ఎంతో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. 
 

కొంతమందికి సెక్స్ పట్ల అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇలా కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పని ఒత్తిడి, సంబంధాలలో ఒత్తిడి, మానసిక స్థితితో పాటు, కొన్నిసార్లు మీరు తినే ఆహారం కూడా దీనికి కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. అంతా బాగానే ఉన్నప్పటికీ మీకు సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉంటే.. మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని ఆహారాలు మీ  సెక్స్ డ్రైవ్ ను, లిబిడోను పెంచుతాయి. 

పురుషులు, మహిళలు ఇద్దరికీ సెక్స్ డ్రైవ్, లిబిడో తక్కువగా ఉండొచ్చు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించడం కష్టంగా మారింది. దీని కారణంగా చాలా మంది యాంగ్జైటీ, నిరాశ వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇవి సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ను తగ్గిస్తాయి. తక్కువ నిద్ర, ఆల్కహాల్, సిగరేట్, శారీరక, మానసిక సమస్యలు వంటివి లిబిడో తగ్గడానికి కారణమవుతాయి. మరి లిబిడో సహజంగా పెరగడానికి ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Latest Videos



పుచ్చకాయ

పుచ్చకాయ కూడా వయగ్రాలాగే సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఈ పండులో రక్త నాళాలకు వయాగ్రా లాంటి ప్రభావాన్ని చూపే పదార్థాలు ఉన్నాయని, లిబిడోను పెంచడానికి కూడా సహాయపడతాయని టెక్సాస్ ఎ అండ్ ఎం ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ పరిశోధకులు 2008 లో కనుగొన్నారు. పుచ్చకాయ అంగస్తంభనను మెరుగుపరుస్తుంది. అలాగే మీ లిబిడోను పెంచుతుంది. ఈ పండులో సిట్రులిన్ కూడా ఉంటుంది. ఇది అమైనో ఆమ్లాలు, అర్జినిన్ ను శరీరంలోకి విడుదల చేస్తుంది. 
 

చాక్లెట్

చాక్లెట్ ను ఇష్టపడని వారు అస్సలు ఉండరు. నిజానికి డార్క్ చాక్లెట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇది శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు లైంగిక ఆనందాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ మీ శరీరంలో ఫినెథైలామైన్, సెరోటోనిన్ విడుదలను ప్రోత్సహిస్తుంది. ఇది కొన్ని కామోద్దీపన, మానసిక స్థితిని మెరుగుపరిచే ప్రభావాలను ఉత్పత్తి చేస్తుంది.
 

Avocado

అవొకాడో

అవొకాడోల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన సెక్స్ డ్రైవ్ కు చాలా చాలా అవసరం. ఫోలిక్ ఆమ్లం శరీరానికి శక్తిని పంప్ చేస్తుంది. విటమిన్ బి 6 హార్మోన్లను స్థిరీకరిస్తుంది.
 

కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు లైంగిక పనితీరును కూడా  మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఉపయోగించడానికి రెండు కుంకుమ పువ్వులను తీసుకుని గోరువెచ్చని నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తర్వాత మీరు వీటిని అన్నం, క్వినోవా లేదా బార్లీ వంటి ఏదైనా తృణధాన్యాలతో కలిపితినొచ్చు లేదా సూప్లు లేదా వంటకాల్లో ఉపయోగించొచ్చు.

strawberries

స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు

ఈ పండ్ల విత్తనాలలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్త్రీ పురుషులిద్దరి శృంగారానికి అవసరం. మహిళల శరీరంలో జింక్ పరిమాణం ఎక్కువగా ఉంటే వారు శృంగారానికి సిద్ధం కావడం సులభమవుతుంది. పురుషులలో జింక్ స్పెర్మ్ ఉత్పత్తికి కారణమయ్యే టెస్టోస్టెరాన్ స్థాయిలను నియంత్రిస్తుంది.
 

click me!