Relationship: 18 ఏళ్ళు దాటిన యువతరం.. ఈ విషయాలపై దృష్టి పెట్టండి!

First Published | Oct 5, 2023, 2:05 PM IST

Relationship: చాలామంది పిల్లలు 18 ఏళ్లు దాటిన తర్వాత వాళ్ళ సొంత నిర్ణయాలతో జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే 18 ఏళ్లు దాటిన అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఈ తప్పులు చేయకుండా ఉంటే చాలా మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 

18 ఏళ్ల వయసు అంటే ఉరుకులు పరుగులు తీసే వయసు, ప్రపంచం అంతా రంగులమయం లా కనిపించే వయసు. ఇలాంటి వయసులో తెలిసి తెలియకుండా  చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. కొన్ని తప్పులు సరిదిద్దుకునేవి అయితే కొన్ని తప్పులు జీవితాన్ని నాశనం చేసేసేవి ఉంటాయి.
 

అందుకే ఈ వయసు చాలా కీలకం. చాలా జాగ్రత్తలు తీసుకొని అడుగున ముందుకు వేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ చదువుని నిర్లక్ష్యం చేయకండి. అప్పుడప్పుడే మీరు చూస్తున్న ప్రపంచం మిమ్మల్ని ఆకర్షిస్తుంది, చదువుని నిర్లక్ష్యం చేసేలాగా చేస్తుంది.
 

Latest Videos


 కానీ మీ సరదాలు మీ సంతోషాలు తీర్చుకుంటూనే చదువుపై దృష్టి పెట్టండి. లేదంటే భవిష్యత్తు మొత్తం బాధపడవలసిన అవసరం ఉంటుంది. అలాగే పెరిగిన స్నేహాలు, పరిచయమైన కొత్త బంధాలు వల్ల ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి.
 

 అయితే అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోండి. లేదంటే ఈ దుబారా ఖర్చు అనే అలవాటు మిమ్మల్ని ప్రమాదం అంచులకి తీసుకువెళ్తుంది. అలాగే ఈ వయసులో సినిమాలు షికార్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఊహాజనిత ప్రపంచంలో ఉండే మనుషులని తమ జీవితాల్లో ఊహించుకుంటూ ఉంటారు చాలామంది.
 

 అయితే అది నిజజీవితంలో చాలామందికి జరగదు. సినిమాల్లో జరిగినంత త్వరగా జీవితాల్లో మార్పులు జరగవు, గమనించి సరియైన నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ వయసులో ఎక్కువగా అందరూ ప్రేమకి ఆకర్షితులవుతారు. అయితే ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రేమకి వ్యామోహానికి మధ్యన ఉన్న తేడా తెలుసుకోండి.
 

 టైంపాస్ ప్రేమ వ్యవహారాలు పెట్టుకోకండి. వీటి ధ్యాస లో పడి భవిష్యత్తుని చదువుని నిర్లక్ష్యం చేయకండి. అలాగే పరిచయమైన ప్రతి బంధాన్ని గుడ్డిగా నమ్మకండి. మేక వన్నె పులులు మీ చుట్టూ ఉంటారు గమనించండి. ఈ వయసులో మీరు జాగ్రత్త తీసుకుని వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తుకు పునాది అని గుర్తుంచుకోండి.

click me!