అమ్మాయిల్ని మొదటి సారి కలిసినప్పుడు అబ్బాయిలు ఏం చూస్తారంటే ?
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఆఫీస్‌లో బాస్‌ని, సహోద్యోగులను ఇంప్రెస్ చేయడానికి లేదా అబ్బాయిని, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తెగ ప్రయత్నిస్తుంటాం. అలాగే.. అమ్మాయిల్ని మొదటి సారి కలిసినప్పుడు అబ్బాయిలు ఏం చూస్తారంటే ?

సానుకూల శక్తి
వైబ్ బాగుండాలి అంటారు. ఒక అమ్మాయిని చూసినప్పుడు పాజిటివ్ వైబ్ వస్తే కాంటాక్ట్, కమ్యూనికేషన్ చేయవచ్చు.
అందం
వేసుకున్న బట్టలు ఎలా ఉన్నాయి? డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది? గోళ్లు శుభ్రంగా ఉన్నాయా? నెయిల్ పాలిష్ నీట్‌గా ఉందా అని చూస్తారు.
జుట్టు
జుట్టు పొడవుగా ఉందా? షార్ట్ గా ఉందా? జుట్టుకి కలరింగ్ చేశారా? జుట్టు మెరుపుగా ఉందా అని అబ్బాయిలు గమనిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అంత గౌరవంగా కనిపిస్తారట.
బాడీ లాంగ్వేజ్
ఆత్మవిశ్వాసం ఆకర్షణనిస్తుంది. ఓ స్త్రీ ఆత్మవిశ్వాసంతో నడిస్తే పురుషుల దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే.. ఇది ఆమె వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందట.
కళ్ళు
కళ్ళను ఆత్మకు అద్దం అంటారు. కళ్లు భావోద్వేగాలు, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. కొంతమంది అమ్మాయిలను చూస్తే.. మొదటి చూపులోనే ఐ కాంటాక్ట్ ఒక స్పార్క్ వస్తుందట. .
మేకప్
మేకప్ ఎక్కువగా ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. ఇది తప్పు. మేకప్ తక్కువగా, సింపుల్‌గా ఉంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. అబ్బాయిలు సహజంగా సౌందర్యంగా ఉన్నవారిని మాత్రమే ఇష్టపడుతారంట.
చిరునవ్వు
నిజమైన చిరునవ్వు స్నేహానికి చిహ్నం. పురుషులు సాధారణంగా స్త్రీ చిరునవ్వును ముందుగా గమనిస్తారు, ఎందుకంటే అది స్నేహాన్ని సూచిస్తుంది. ప్రకాశవంతమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వు మంచి సంభాషణ, అనుబంధానికి దారితీస్తుంది.
ప్రవర్తన
ఒక అమ్మాయి ఎంత మాట్లాడుతుంది? ఎలా మాట్లాడుతుంది? ఇతరులతో ఎలా ప్రవర్తిస్తుంది అనేది కూడా ముఖ్యం. మనం మాట్లాడే తీరును బట్టే మన బంధాలు కొనసాగుతాయి.