సెక్స్ తర్వాత నిద్రపోతే..!

First Published | Sep 18, 2023, 1:03 PM IST

సెక్స్ తర్వాత ఆడవాళ్లు, మగవాళ్లు నిద్రలోకి జారుకుంటారు.  ఇలా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే? 
 

భాగస్వామితో శారీరక సంబంధం గురించి మాట్లాడినప్పుడు ఆడవారి బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారుతాయి. అయితే చాలా మంది ఈ విషయం గురించి బయట అస్సలు మాట్లాడరు. దీనివల్ల చాలా మందికి శారీరక సాన్నిహిత్యం గురించి పూర్తిగా తెలియదు. అలాగే చాలా మంది దీని గురించి తెలుసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే సెక్స్ విషయంలో ఎన్నో అపోహలను నమ్ముతుంటారు. అయితే సెక్స్ లో పాల్గొన్న తర్వాత చాలా మంది ఆడవారు, మగవారు నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇలా నిద్రపోవడం మంచిదా? చెడ్డదా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Sexual Relationship

శారీరక సంబంధం వల్ల శరీరంలో ఎన్నో రకాల రసాయనాలు రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా సెక్స్ వల్ల శరీరంలో డోపామైన్, ఆడ్రినలిన్ వంటి హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే మీ శరీరం బాగా విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తుంది. సెక్స్, ఇతర శారీరక సాన్నిహిత్యం వల్ల అలసిపోతారు. దీనివల్ల నిద్రమత్తుగా ఉంటుంది. స్త్రీ శారీరక సంబంధం తర్వాత ఈ మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్ లో జరిపిన ఒక అధ్యయనం.. శారీరక సాన్నిహిత్యం వల్ల వెంటనే శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పెరుగుతాయని సూచిస్తుంది. నిద్రకు సహాయపడే సెరోటోనిన్, ఇతర న్యూరోకెమికల్స్ ను ఉపయోగించడానికి ఈస్ట్రోజెన్ సహాయపడుతుంది.


సెక్స్ చేసిన తర్వాత నిద్రపోవడం మంచిదేనా?

ఈ సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఇది ఒత్తిడి కలిగించే కార్డిసాల్ అనే హార్మోన్ ను నియంత్రిస్తుంది. కార్టిసాల్ ను స్ట్రెస్ హార్మోన్ అని అంటారు. మన మెదడులోని పిట్యూటరీ గ్రంథి కార్టిసాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి కార్టిసాల్ ఎంతో సహాయపడుతుంది. మీ శరీరంలో ఆక్సిటోసిన్ స్థాయిలు పెరిగేకొద్దీ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ పరిమాణం చాలా వరకు తగ్గుతుంది.
 

ఒత్తిడిని తగ్గించడం 

ఒత్తిడిని తగ్గించడం వల్ల శరీరంపై సానుకూల ప్రభావం పడుతుంది. కాబట్టి  సెక్స్ తర్వాత ఈ హార్మోన్ రిలీజ్ అయితే ఒత్తిడి తగ్గి నిద్ర పట్టడం మొదలవుతుంది. అందుకే సెక్స్ సమయంలో త్వరగా నిద్రపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే సెక్స్ తర్వాత కొంతమంది మహిళలు చాలా త్వరగా నిద్రపోతారు. అయితే దీని తర్వాత వీళ్లు భాగస్వామితో మాట్లాడటానికి ఆసక్తి చూపుతారు. 
 

సెక్స్ చేసిన తర్వాత పురుషులు త్వరగా ఎందుకు నిద్రపోతారు?

పురుషుల ఎరోజెనస్ పీరియడ్ ను నియంత్రించే, సెక్స్ తర్వాత నిద్రకు కారణమయ్యే ప్రోలాక్టిన్ అనే హార్మోన్ స్థాయిలు భావప్రాప్తి తర్వాత పెరుగుతాయి. ప్రోలాక్టిన్ అనేది ఒక హార్మోన్. ఇది నోర్పైన్ఫ్రైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, నైట్రిక్ ఆక్సైడ్ వంటి వివిధ హార్మోన్ల విడుదలతో శరీరం, మెదడును నింపుతుంది. ఎన్నో మంచి హార్మోన్లు మీలో సంతృప్తి భావనను కలిగిస్తాయి. ఈ గుడ్ హార్మోన్లు,  న్యూరోకెమికల్స్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే నెమ్మదిగా నిద్రలోకి జారుకోవడానికి సహాయపడతాయి. 
 

పురుషులు సెక్స్ తర్వాత నిద్రలోకి జారుకోవడానికి మరొక కారణం ఏంటంటే..? సెక్స్ తో వీరి కండరాలలో శక్తిని ఉత్పత్తి చేసే గ్లైకోజెన్ తగ్గుతుంది. అయితే పురుషుల కంటే మహిళలకు తక్కువ కండరాలు ఉంటాయి. అయితే ఆడవాళ్లకు నిద్రపోయేటప్పుడు పురుషుల మాదిరిగా సెక్స్ తర్వాత బద్ధకంగా అనిపించదు.
 

సెక్స్ తర్వాత నిద్రపోవడానికి ఇతర కారణాలు

హార్మోన్ల విడుదల అవడంతో పాటుగా నిద్రపోవడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు నిపుణులు. చాలా మంది చీకట్లోనే సెక్స్ లో పాల్గొంటారు. చీకటి కారణంగా శరీరానికి సంకేతాలు అందుతాయి. దీంతో నిద్రపోయే సమయం ఆసన్నమైందని మీ శరీరం గ్రహిస్తుంది. అలాగే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపోవడానికి సహాయపడుతుంది. శృంగారంలో పాల్గొన్న తర్వాత నిద్రపోవడం మొదలుపెడతారు. దీనివల్ల జరిగే నష్టమేమీ లేదు.

Latest Videos

click me!